Telugu Mirror: చంద్రయాన్ -3 మిషన్ నిర్దేశించిన మూడు లక్ష్యాలలో రెండు సాధించామని, ఇస్రో తెలిపింది. మొదటిది చంద్రుని ఉపరితలం మీద సురక్షిత, మృదువైన ల్యాండింగ్ అని రెండవది రోవర్ కదలికలతో రెండు లక్ష్యాలు సాధించబడ్డాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO )శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మూడవ లక్ష్యం, ఇంతవరకు కనిపెట్టబడని చంద్రుని ధ్రువ ప్రాంతాల పై అధ్యయననాలను ముందుకు తీసుకు వెళ్ళే శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించడం కోసం రోవర్ ప్రయోగాలు మొదలయ్యాయి. అని శుక్రవారం నాటికి అన్ని పేలోడ్ లు యాక్టిివ్ అయ్యాయని స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. ఇస్రో విడుదల చేసిన వీడియోలో ఇస్రో ఇటీవలే చంద్రుని పైకి విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్ -3 మిషన్
లోని ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan Rover) చంద్రుని ఉపరితలంపై పరిశోధించే సమయంలో తీసిన వీడియోను విడుదల చేసింది. అంతరిక్షంలోకి విక్రమ్ ల్యాండర్‌లో చంద్రునిపైకి దిగిన రోవర్ ఇప్పుడు చంద్రుని ఉపరితలంపై ఎనిమిది మీటర్లకు పైగా ముందుకు కదిలింది. ఈ వారం ప్రారంభంలో చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ -3 విజయవంతంగా ల్యాండ్ అయింది, ల్యాండింగ్ పాయింట్ కి ఇప్పుడు ‘శివశక్తి’ పాయింట్ (Shiva Shakthi Point) అని పేరు పెట్టారు.
చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన కొన్ని రోజులకు. చంద్రయాన్ -3 అనేక మిషన్ లక్ష్యాలను గుర్తించడంలో సఫలమైనట్లు ఇస్రో తెలిపింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) శనివారం సాయంత్రం షేర్ చేసిన అప్‌డేట్‌లో చంద్రాయాన్ 3 మిషన్ నిర్దేశించిన మూడు లక్ష్యాలలో రెండు ఇప్పటికే చేరుకున్నట్లు పేర్కొంది. రోవర్ మరియు ల్యాండర్ సౌత్ పోల్ లోని చంద్రుని ఉపరితలంపై ఇన్-సిటు శాస్త్రీయ ప్రయోగాలను మొదలెట్టాయి.
“విక్రమ్ ల్యాండర్ 3 మిషన్ లక్ష్యాలలో, చంద్రుని ఉపరితలం మీద సేఫ్ మరియు సాఫ్ట్ ల్యాండింగ్ యొక్క ప్రదర్శనను సాధించడం పూర్తయింది. చంద్రునిపై రోవర్ పనితీరు ప్రారంభమైంది. రోవర్ తిరుగుతున్న దృశ్యాల ప్రదర్శన వీడియో పంపబడింది. ప్రజ్ఞాన్ రోవర్ చుట్టూతా ఉన్న స్థలంలో శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడం జరుగుతోంది. అన్ని పేలోడ్‌లు సాధారణంగా పని చేస్తున్నాయి” అని అంతరిక్ష సంస్థ ట్వీట్ చేసింది.
చంద్రయాన్-3 ల్యాండర్ ఈ వారం ప్రారంభంలో చంద్రుని ఉపరితలాన్ని విజయవంతంగా తాకింది. భారతదేశం చంద్రునిపై అడుగుపెట్టిన నాల్గవ దేశం మరియు ఇంతవరకు అన్వేషించని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి దేశం.
చంద్రుని దక్షిణ ధ్రువంలోని రహస్యాలను పరిశోధించడానికి ప్రజ్ఞాన్ రోవర్ శివశక్తి పాయింట్ చుట్టూ రోల్ అవుతుంది” అని భారత అంతరిక్ష సంస్థ ట్వీట్ చేసింది.
Chandrayaan-3 Mission:
🔍What's new here?Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM
— ISRO (@isro) August 26, 2023
చంద్రయాన్-3 సేఫ్ గా ల్యాండింగ్ అయిన సైట్‌కు ‘శివశక్తి పాయింట్’ అని పేరుని పెట్టిన ప్రధాని నరేంద్ర మోడి (Narendra Modi) , ల్యాండింగ్ తేదీని ప్రతి సంవత్సరం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న ఇంతవరకు ఎవరు అన్వేషించని చంద్రుని దక్షిణ ధ్రువాన్ని తాకింది.
ఇంతలో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ విక్రమ్ తాకిన చోటు అయిన శివశక్తి పాయింట్ చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్నట్లు చూపించే తాజా వీడియోను విడుదల చేసింది.