Telugu Mirror: మానవ శరీరంలో హార్మోన్లు (Hormonoes) ముఖ్యమైన పనుల్లో ప్రత్యేక పాత్రను పోషిస్తాయి. ఈ హార్మోన్లు శరీరంలో రక్తం ద్వారా అన్ని శరీర భాగాలకు అనగా కండరాలు, చర్మం మరియు ఇతర కణజాలాలకు ఆదేశాలను తీసుకువెళతాయి. తద్వారా శరీరంలో సమన్వయం చేసే రసాయనాలు పురుషుల (Men) కు మరియు స్త్రీల (Women) కు శరీరంలోని వివిధ రకాల పనులకు కొన్ని హార్మోన్లు అవసరం అవుతాయి. టెస్టోస్టిరాన్ హార్మోన్ మగవారిలో ప్రత్యేక పాత్రను కలిగి ఉంటుంది. దీనిని “మగహార్మోన్” (Male Hormone) అని పిలుస్తారు.
ఈ హార్మోన్ కండరాల శక్తిని పెంచడం, బలం, ఎదుగుదల మరియు ముఖం అలాగే శరీర వెంట్రుకలు నిర్వహణ వీటిల్లో దీని పాత్ర ఉంటుంది. స్పెర్మ్ (Sperm)పెరుగుదలకు టెస్టోస్టిరాన్ హార్మోన్ (testosterone hormone) చాలా ముఖ్యం. జీవనశైలిలో మార్పులు మరియు డైట్ కు సంబంధించిన వివిధ రకాల ఇబ్బందుల వల్ల శారీరక ఆరోగ్యం పై చెడు ప్రభావం పడడమే కాకుండా హార్మోన్లలో అసమతుల్యతకు కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు.
శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరియు ఈ హార్మోన్ కోసం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకుందాం. టెస్టోస్టిరాన్ హార్మోన్ లోపం వల్ల శారీరక ఆరోగ్యం పై తీవ్రంగా ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ హార్మోన్ లోపం వల్ల సెక్స్ సామర్థ్యం కోల్పోవడం, గడ్డం సరిగా పెరగకపోవడం, కండరాల సమస్యలు, ఎప్పుడూ అలసటగా ఉండటం, ఊబకాయం అలాగే నిరాశ ఇటువంటి సమస్యలు వస్తాయి. అయితే ఆహారంలో కొన్నింటిని చేర్చడం వల్ల ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరగడానికి ఉపయోగపడతాయని వైద్యులు అంటున్నారు. అవి ఏమిటో చూద్దాం.
దానిమ్మ (pomegranate):
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. శరీరానికి అవసరమైన అనేక రకాల పోషక విలువలను అందిస్తుంది. ఇది శరీరంలో వచ్చే వాపు మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరుగుదలకు కూడా దోహదపడుతుందని అధ్యయనాలలో ఋజువు అయ్యింది.
అరటి పండు (Banana):
సీజనల్ ఫ్రూట్స్ (Seasonal Fruits) ను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనాలను లభిస్తాయి. ఏడాది పొడవునా మనకు అరటి పండ్లు లభిస్తాయి. వీటిల్లో పొటాషియం (Potassium) అధికంగా ఉంటుంది. ఇది సంకోచ సమయంలో సహాయపడటమే కాకుండా వ్యాయామం చేసే సమయంలో కండరాల తిమ్మిరి సమస్యను తగ్గించడంలో తోడ్పడుతుంది. అరటిపండును రోజు తినడం వల్ల కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. మరియు టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఆకుకూరలు (Leafy Vegetables):
బచ్చలి కూర, కాలే మరియు ఇతర ఆకుకూరల్లో (Leafy Vegetables) మెగ్నీషియం (Magnesium) అధికంగా ఉంటుంది. ఇవి టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిని పెంచడంతోపాటు, కండరాల పనితీరుకు సహాయపడుతుంది. ఆకుకూరలలో ఇనుముతో పాటు ఇతర పోషక విలువలను శరీరానికి సులభంగా అందించడంలో తోడ్పడతాయి. ఇవి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి టెస్టోస్టిరాన్ హార్మోన్ తక్కువగా ఉన్నవారు ఇటువంటి ఆహార పదార్థాలను రోజువారి ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాము. ఈ కథనం కేవలం పాఠకులకు జ్ఞానం మరియు అవగాహన కలిగించడం కోసమే ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం ఉత్తమ మార్గం..గమనించగలరు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…