Telugu Mirror: మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో మార్గాలను వెతుకుతాం.ఈ రోజుల్లో నూరేళ్ళ ఆయిష్షుతో బతుకుతాం అనే గ్యారెంటీ ఎవరికీ లేదు. కానీ మనం దీర్ఘ కాల వ్యాధులు రాకుండా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం.హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. “మెడిటరేనియన్” (Mediterranean) జీవన శైలిని అలవాటు చేసుకోగలిగితే ఆరోగ్య విషయం లో మంచి లాభాన్ని పొందవచ్చు.
ఆ మధ్యధరా జీవన విధానం ఎలా ఉంటుంది ?
మధ్యధరా జీవన శైలి నిర్వచనం ఏమిటంటే. రోజు వారి ఆహరం లో గుడ్లు , మాంసం , చేపలు మరియు రక రకాల కూరగాయలు తీసుకోవాలి, వ్యాయాయం ప్రతిరోజు సక్రమంగా చేయాలి, మానసిక దిగులును, ఒత్తిళ్లను దూరం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి, నెట్టింట ఎక్కువసేపు గడపడం మానేయాలి. మరి ఈ విధమైన జీవన శైలిని అభ్యసించాలంటే , వివిధరకమైన చిరు ధాన్యాలను తీసుకోవడం మంచిది అలాగే ప్రతి సీజన్లో దొరికే పండ్లను తినాలి , ఇంకా రకరకాల కూరగాయలను తీసుకోవాలి. యోగ (Yoga) మరియు వ్యాయామం స్థిరంగా చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా విశ్రాంతి (Rest) ని తీసుకోవాలి అని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.మన జీవన విధానం ఇలా ఉన్నట్లు అయితే అకాల మరణం సంభవించకుండా దాని పై గెలిచే అవకాశం ఉంటుంది అని నిపుణులు పేర్కొన్నారు.
Also Read:Banana Lasi: మధురమైన బనానా లస్సిని తయారు చేసుకోండి ఇలా. ప్రయోజనాలు పొందండి అలాఈరోజుల్లో పెద్ద చిన్న అదే భేదం లేకుండా అన్ని వయసుల వారికీ చిన్న జబ్బు నుండి పెద్ద జబ్బు వరకు వస్తున్నాయి. గుండె సంబంధిత వ్యాధుల నుండి అత్యంత ప్రధానంగా చెప్పుకునే క్యాన్సర్ (Cancer) వరకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు . గత కొన్నేళ్లుగా పరిశీలించినట్లు అయితే ప్రపంచం లో మరణాల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని మరణ ప్రమాదాల సంఖ్య మెడిటరేనియన్ జీవనశైలి వల్ల 29 శాతం తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడించాయి.
తొమ్మిది సంవత్సరాల పరిశోధనలో దాదాపు లక్ష మంది మీద పరిశోధించారు. ఈ అధ్యయనంలో ఎవరైతే పాల్గొంటారో వారందరు ఈ జీవన శైలిని స్టడీ చేసారు. ప్రతి ఒక్కరిలో వయస్సు పెరుగుతున్నప్పటికీ శారీరకంగా మరియు మానసికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యాంగా ఉన్నట్టు పరిశోధన ముగించే సమయం లో తేలింది. పాజిటివ్ రిజల్ట్ రావడం తో ఈ జీవన శైలిని మూసేసారు.
ప్రస్తుతం ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రకమైన జీవనశైలికి అలవాటు పడాలంటే కొన్ని పద్దతులను పాటించాలి. గతం లో ఎప్పుడు డైటింగ్ (Dieting) అలవాటు లేకపోతే ఈ జీవన శైలికి వెంటనే మారకండి. మీరు నిపుణుల సహాయం తీసుకొని ఈ మెడిటరేనియన్ జీవనశైలిని మొదలు పెట్టడం మంచిది. ఎందుకంటే శరీర అంతర్గత నిర్మాణం ఎవరికి ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి మీ నిర్ణయానికంటే ముందు నిపుణులను సంప్రదించి వారి నిర్ణయం తీసుకోవడం మంచిది.