మార్కెట్లోకి రకరకాల సౌందర్య ఉత్పత్తులు (Beauty products) అందుబాటులోకి వస్తున్నాయి. వాటి వల్ల మెరిసే చర్మం (skin) పొందవచ్చు. కానీ చర్మం త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మెరిసే చర్మం పొందడం కోసం సహజ (natural) పద్ధతులను పాటించినట్లయితే చర్మం ఎక్కువ కాలం ఆరోగ్యంగా (Healthy) ఉంటుంది.
అయితే ఈ రోజు కథనంలో చపాతీలు ఉపయోగించి కాంతివంతమైన (bright) చర్మం ఎలా పొందాలో తెలియజేస్తున్నాము. ఒక్కొక్కసారి చపాతీలు మిగిలి పోతుంటాయి. వాటిని ఉపయోగించి ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని వాడినట్లయితే గ్లోయింగ్ (Glowing) స్కిన్ పొందవచ్చు. ఇది వినటానికి విచిత్రంగా అనిపించినా ఇది వాస్తవం. ఒకసారి ప్రయత్నించి చూడండి. తేడా మీకే తెలుస్తుంది.
మార్కెట్లో లభించే క్రీమ్ లు వాడినప్పుడు కొన్ని రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది. కానీ వాటిని వాడటం చర్మం కు హాని కలుగుతుంది. ఎందుకనగా వాటిలో రసాయనాలు (Chemicals) ఉంటాయి కాబట్టి.
అందుకే చాలా మంది ఇంటి చిట్కాలు (Home Tips) పై ఆధారపడుతున్నారు. వీటిని కూడా తరచుగా వాడటం వల్ల కొన్ని రోజుల్లోనే సహజ సౌందర్యాన్ని పొందవచ్చు. వీటిని వాడటం వల్ల చర్మంపై దుష్ప్రభావాలు (Side effects) ఉండవు.
చపాతీని ఉపయోగించి తయారు చేసే ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకుందాం.
దీనికి కావలసిన పదార్థాలు:
చపాతి, తేనె, పచ్చిపాలు.
తయారీ విధానం:
ముందుగా చపాతీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టి పొడిలా చేయాలి. ఈ పొడిలో కొద్దిగా తేనె మరియు పచ్చిపాలు వేసి కలిపి పేస్ట్ లా తయారు చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి (Face) మరియు మెడకి (Neck) అప్లై చేసి సున్నితంగా మర్దనా చేయాలి. మసాజ్ చేసిన తర్వాత 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని సున్నితంగా రుద్దుతూ కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ మంచి స్క్రబ్ (Scrub) గా కూడా ఉపయోగపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండు లేదా మూడుసార్లు ఉపయోగించవచ్చు. కొన్ని రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది.
ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఉపయోగాలు గురించి తెలుసుకుందాం:
ఈ ఫేస్ ప్యాక్ ను వాడటం వల్ల మూసుకుపోయిన చర్మ రంధ్రాలను (Open Pores) తెరుచుకోవడం లో సహాయపడుతుంది.
ఈ ప్యాక్ చర్మం లోపల నుంచి కూడా శుభ్రం చేసేలా సహాయపడుతుంది. దీనిలో తేనెను ఉపయోగించాము.తేనె (Honey) చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.
Also Read : Face Pack : పాలు, తేనెలతో పాలుగారే ముఖం మీ సొంతం
Coffee Powder : మగువల ముఖారవిందాన్ని పెంచే కాఫీ పౌడర్
తద్వారా వాతావారణం మారుతున్నప్పుడు చర్మాన్ని హైడ్రేట్ (Hydrate) గా ఉంచుతుంది. మరియు పచ్చిపాలు (Raw Milk) చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడతాయి.
కాబట్టి మెరిసే చర్మం పొందడం కోసం మార్కెట్లో లభించే క్రీమ్ లకు బదులుగా ఇంట్లో తయారు చేసుకునే నాచురల్ (Natural) రెమెడీస్ వాడి కూడా మెరిసే చర్మం ను పొందవచ్చు. ఇటువంటి ఫేస్ ప్యాక్ లు వాడటం వల్ల చర్మం మీద చెడు ప్రభావం కూడా ఉండదు.