PM Kisan Eligibility : పీఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా? ఇలా చెక్ చేసుకుంటే సరి

PM Kisan Eligibility

PM Kisan Eligibility: ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది దేశంలోని రైతులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఈ పథకం అర్హులైన రైతులందరికీ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఫిబ్రవరి 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకం కింద రైతులు వార్షికంగా రూ.6000 అందుకుంటారు. ఏప్రిల్ నుండి జూలై వరకు, ఆగస్టు నుండి నవంబర్ వరకు మరియు డిసెంబర్ నుండి మార్చి వరకు విడతల వారీగా ఎకరాకు రూ. 2,000 చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.

16వ విడతకు మొత్తం రూ.21,000 కోట్లు

ఫిబ్రవరి 28న మహారాష్ట్ర యవత్మాల్ వేదికగా ప్రధాని మోదీ 16వ విడతను చివరిసారిగా పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా 9 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు. విడుదల చేసిన మొత్తం రూ.21,000 కోట్లకు పైగా ఉంది. పీఎం కిసాన్ నిధులను టైమ్‌టేబుల్ ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు.

Successful PM Kisan Yojana

e-KYC పూర్తి చేస్తేనే డబ్బులు అందుతాయి.

అయితే e-KYC పూర్తి చేసిన రైతులకు మాత్రమే 17వ విడత అందుతుంది. కేంద్రం ఇప్పుడూ e-KYCని తప్పనిసరి చేసింది. KYCని పూర్తి చేయడానికి చాలా ఆప్షన్లు ఉన్నాయి.

మీరు దగ్గర ఉన్న సేవా కేంద్రానికి వెళ్ళవచ్చు.
ఆధార్ కార్డును సబ్మిట్ చేసిన కూడా పని పూర్తవుతుంది.
http://pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి కూడా KYC పూర్తి చేయవచ్చు.
PM కిసాన్ GOI యాప్‌తో ఫేస్ అథారిటికేషన్ ను ఉపయోగించి కూడా KYC పూర్తి చేయవచ్చు.

మరి 17వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు?

రైతుల దృష్టి ఇప్పుడు 17వ విడత నిధులపై పడింది. ఈ విడత ఎప్పటి నుంచి వస్తుందనే చర్చ మొదలైంది. ఇప్పుడు 17వ విడత నిధులు మే చివరి వారంలో విడుదల చేయాలని కేంద్రం భావిస్తుంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి నోటిఫికేషన్ రానప్పటికీ, ఏప్రిల్ – జూన్ మధ్యలో నిధులు విడుదల చేయనున్నారు. అయితే, అందరూ మే నెలలో వచ్చే అవకాశాలు ఉన్నాయ్ అని భావిస్తున్నారు.

CHECK PM KISAN SAMMAN NIDHI STATUS

జాబితాలో మీ పేరు ఉందా లేదా అని ఎలా చెక్ చేయాలి?

అధికారిక స్కీమ్ pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి,
మీ స్క్రీన్‌పై రైట్ కార్నర్ లో ‘బెనిఫిషియరీ లిస్ట్’ అనే లింక్‌ని క్లిక్ చేయండి.
మొత్తం వివరాలు అనగా, గ్రామం, జిల్లా మరియు రాష్ట్రము వంటి వివరాలు ఎంచుకోండి.
“గెట్ రిపోర్ట్” అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి.
ఇక అందులో మీ పేరో లేదో చెక్ చేసుకోండి.

వీరికి డబ్బులు రాకపోవచ్చు

డూప్లికేట్ లబ్ధిదారుని పేరు
KYC పూర్తి చేయని వారికి
మినహాయింపు రైతులకు పీఎం కిసాన్ విడత రాదు
బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డులు లింక్ చేయకపోతే ..
చెల్లని ఖాతా, ఆధార్ కార్డ్
మూసివేసిన, చెల్లని, బదిలీ చేసిన లేదా బ్లాక్ చేసిన బ్యాంకు ఖాతాలు
దరఖాస్తు ఫారమ్‌లో IFSC కోడ్ తప్పు ఉంటే
చెల్లని బ్యాంక్ లేదా పోస్టాఫీసు పేరు.

PM Kisan Eligibility

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in