IPL 2024 : నేటి నుంచి క్రికెట్ పండుగ ఆరంభం కానుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ (IPL) రెండు నెలలపాటు అలరించేందుకు సిద్ధమైంది. ఐపీఎల్ 2024 మెగా టోర్నీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఐపీఎల్ ఆరంభ వేడుకలు సాయంత్రం 6.30 గంటలకే మొదలుకానున్నాయి. చెన్నైను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోని ఈసారి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (Ruthuraj Gaikwad) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈసారైనా కప్ ముద్దాడాలనే లక్ష్యంతో ఆర్‌సీబీ బరిలోకి దిగుతోంది.
Also Read : Bank Jobs : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎలాంటి పరీక్ష లేకుండానే బ్యాంక్ ఉద్యోగం..
ఈ సీజన్‌లో ఆరుగురు కొత్త కెప్టెన్లు వచ్చారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్థిక్ పాండ్యా వచ్చాడు. పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చిన తర్వాత గుజరాత్ టైటాన్స్ కి శుభమన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గత సీజన్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా కొత్త కెప్టెన్‌ని తీసుకొచ్చింది. ఆస్ట్రేలియా ప్రపంచకప్ గెలుచుకోవడంలో ముఖ్య పాత్ర పోషించిన పాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గాయం కారణంగా మునుపటి సీజన్‌కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఈ రోజు చెన్నై-ఆర్‌సీబీ (CSK Vs RCB) మధ్య పోరు హోరాహోరీగా సాగనుంది. రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శార్దూల్ ఠాకూర్, శివమ్ ధుబే, అజింక్యా రహానే మరియు MS ధోనీ వంటి ఆటగాళ్లతో చెన్నై శక్తివంతంగా కనిపిస్తోంది. RCB కూడా ఒక బలమైన బ్యాటింగ్ జట్టు, కానీ బౌలింగ్‌లో లోటు కనిపిస్తుంది. విరాట్ కోహ్లి, మాక్స్‌వెల్ మరియు ఫాప్ డుప్లెసిస్ ముగ్గురు మంచి ఫామ్ లో ఉన్నారుమరియు స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ తో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో అందరి దృష్టి అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్‌లపైనే ఉంది. నాణ్యమైన.
Also Read : Samsung Galaxy M14 : శాంసంగ్ ఫోన్ పై భారీ డిస్కౌంట్.. రూ. 19 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 990 లకే..
చెన్నై సూపర్ కింగ్స్ XI
ఫాప్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, కామెరాన్ గ్రీన్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేశాయ్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మయాంక్ డాగర్, అల్జారీ జోసెఫ్ మరియు మహ్మద్ సిరాజ్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు XI
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, దీపక్ చాహర్, మహేశ్ తీక్ష, మతీషా పతిరానా, శార్దూల్ ఠాకూర్.