Child Leave Andhra Pradesh 2024: మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, 180 రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు

Child Leave Andhra Pradesh 2024

Child Leave Andhra Pradesh 2024: మహిళలకు ఒక అద్భుతమైన వార్త. ఏపీ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటా న్యూస్ అని  అనుకుంటున్నారా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకుందాం. ఇది చాలా మందికి ఉపశమనం కలిగిస్తుందని అనుకోవచ్చు. అయితే, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎవరికి లాభం? వంటి వాటి గురించి తెలుసుకుందాం.

శిశు సంరక్షణ సెలవులపై కీలక నిర్ణయం.

మహిళా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతమైన వార్త అందించింది. పిల్లల సంరక్షణ సెలవుల గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. చైల్డ్ కేర్ లీవ్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

శిశు సంరక్షణ సెలవులపై విధించిన నిబంధనలను ఎత్తివేస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మహిళా ఉద్యోగులు తమ 180 రోజుల సెలవులను ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. దీంతో తమ పిల్లలు 18 ఏళ్లలోపు ఈ సెలవులను వినియోగించుకోవాలనే గతంలో ఉన్న నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.

సెలవులు ఎప్పుడైనా తీసుకోవచ్చు.

ఈ చైల్డ్ కేర్ లీవ్ కోసం గతంలో చెప్పిన  తేదీని ఎత్తివేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు, మహిళా ఉద్యోగులు తమ పిల్లలకు 18 ఏళ్లు నిండకముందే చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవాల్సి ఉండేది. అయితే, ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించింది. ఈ సెలవులను ఎప్పుడైనా తీసుకోవచ్చు అని ప్రభుత్వం చెప్పింది.

పదవీ విరమణలోపు  ఎప్పుడైనా సెలవులు తీసుకోవచ్చు.

అంటే మహిళా ఉద్యోగులు తమ పదవీ విరమణలోపు  ఎప్పుడైనా ఈ సెలవును ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా అమరావతిలో సచివాలయ ఉద్యోగులకు స్థలాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి శనివారం ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పవచ్చు.

సచివాలయ ఉద్యోగులకు స్థలాల కేటాయింపు.

అమరావతిలోని పిచ్చుకలపాలెం గ్రామంలో సచివాలయ సిబ్బందికి స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాలు కేటాయించేందుకు 2019లో జారీ చేసిన జీవో నిబంధనల ప్రకారమే స్థలం, స్థలాల ధర ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మికులపై, ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏలపై సమ్మె కాలంలో నమోదయిన కేసులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. సమ్మె సందర్భంగా అంగన్‌వాడీ సిబ్బందికి కూడా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు.

Child Leave Andhra Pradesh 2024

 

 

 

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in