Chiranjeevi 10th Marks Memo: మెగా స్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఒక సాధారణ కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టి, ఎన్నో కష్టాలు పడి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎదిగి, హీరోగా, సుప్రీమ్ హీరోగా, చివరికి మెగాస్టార్‌గా ఎదిగారు. నటన, డ్యాన్స్ మరియు సమాజ సేవా అన్నీ అతన్ని తన అభిమానులకు మరింత దగ్గర చేసాయి. మెగాస్టార్‌గా, నిజమైన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
తెలుగు సినీ పరిశ్రమలో (Telugu Cinema Industry) చిరంజీవి మరియు అతని ఫ్యామిలీకి ఎంతో అరుదైన గౌరవం ఉంటుంది. ఎవరి అండ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చిన చిరంజీవి ఇప్పుడు కొన్ని కోట్ల అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, స్వయం కృషిని నమ్ముకొని సినీ పరిశ్రమకి వచ్చి వెండి తెర పై ఎన్నో సినిమాలు చేశారు.
కుడిచేతి చేతితో చేసే సాయం ఎడమ చేతికి తెలియకుండా చూసుకుంటున్నాడు మెగాస్టార్. తాజాగా పద్మవిభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. దాదాపు 70 ఏళ్లు వచ్చినా చిరంజీవి కుర్ర స్టార్లతో పోటీ పడుతూ సినిమాలు తీస్తున్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గురించిన ఓ వార్త సోషల్ మీడియా (Social Media) లో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. చిరంజీవికి పదో తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి. అతనికి పదో తరగతిలో ఏ ర్యాంక్ సాధించారు అనే విషయం వైరల్‌గా మారింది. అంతేకాదు మెగాస్టార్ (Megastar) పదో తరగతి సర్టిఫికెట్ కూడా వైరల్ అవుతోంది.
Also Read: సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలకు ముందు ఏమి చేశారు?
ఈ సర్టిఫికెట్‌లో చిరంజీవి పేరు కెఎస్‌ఎస్ వరప్రసాద్‌రావు కాగా, ఆయన తండ్రి పేరు వెంకట్‌రావు. చిరు పెనుగొండలో పుట్టాడని సమాచారం. అయితే ఇందులో మెగాస్టార్ (Megastar) కు ఎన్ని మార్కులు పడ్డాయో క్లారిటీ లేదు. సర్టిఫికేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక పోతే చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వరుస సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ప్లాప్‌లు వస్తున్నప్పటికీ, హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చిరు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అయిన వశిష్ఠతో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిష అతని జంటగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.