క్రిస్మస్ దగ్గరలోనే ఉంది. ఇది మీకు ఇస్టమైన వారికి బహుమతులు అందించడానికి మరియు పండుగ షాపింగ్ జరుపుకునే సీజన్. మీరు ప్రీమియం ట్రీట్‌ల కోసం చూస్తున్నారా లేదా మీకు సరసమైన (affordable) ధరలలో సరిపోయే వాటి కోసం చూస్తున్నారా, ఢిల్లీలోని క్రిస్మస్ మార్కెట్‌లు ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తాయి.
ఢిల్లీ- ది నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) లో క్రిస్మస్ షాపింగ్ కోసం ఉత్తమ మార్కెట్‌ల జాబితా ఇక్కడ ఉంది:
1. సరోజినీ నగర్ మార్కెట్
దేశ రాజధానిలో అత్యంత బిజీగా ఉండే మార్కెట్‌లలో ఒకటి, సరోజినీ నగర్ మార్కెట్ పండుగ సీజన్లలో, మరీ ముఖ్యంగా దీపావళి మరియు క్రిస్మస్ సమయంలో చాలా రద్దీని కలిగి ఉంటుంది. దక్షిణ ఢిల్లీలో ఉన్న సరోజినీ నగర్‌లోని దుకాణాలు వినియోగదారుల బడ్జెట్‌ను బట్టి వివిధ రకాల ఉత్పత్తులను (products) అందిస్తాయి.
2. లజపత్ నగర్ మార్కెట్
లజ్‌పత్ నగర్ మార్కెట్ వివిధ వెరైటీలకు ప్రసిద్ధి చెందింది. క్రిస్మస్ చెట్లు మరియు అలంకరణ (decoration) సామగ్రి తో పాటు ఈ మార్కెట్‌లో అన్నీ లభిస్తాయి.
3. లండన్ క్రిస్మస్ మార్కెట్
గురుగ్రామ్ లోని ఢిల్లీ ల్యాండ్ అండ్ ఫైనాన్స్ (DLF) ఫేజ్ 1లో గల లండన్ క్రిస్మస్ మార్కెట్ చలికాలంలో మీ వార్డ్‌రోబ్‌ను నవీకరణ (update) చేయడానికి ఉత్తమమైన ప్రదేశం. లండన్ క్రిస్మస్ మార్కెట్ లోకి ప్రవేశం ఉచితం.
4. Sorbet Soiree క్రిస్మస్ మార్కెట్
సుందర్ నర్సరీలోని సోర్బెట్ సోయిరీ క్రిస్మస్ మార్కెట్‌ను మీరు సందర్శించవచ్చు. ఇక్కడ మీరు ఇంటి అలంకరణ, సౌందర్య సాధనాలు మరియు ఫ్యాషన్‌లో ఏదైనా వెతుకుతున్నట్లయితే ఈ మార్కెట్ లో పొందవచ్చు, ఇక్కడ మీరు మీకు ఆత్మీయులైన (Beloved) వారి కోసం అత్యంత ప్రత్యేకమైన క్రిస్మస్ బహుమతులను కనుగొనవచ్చు.
5. సదర్ బజార్
సదర్ బజార్, పాత ఢిల్లీలోని అతిపెద్ద టోకు (Largest wholesale) సౌందర్య మరియు ఆభరణాల బజార్, సదర్ బజార్ చౌక ధరలకు అనేక రకాల వస్తువులను అందిస్తుంది.