Coconut Milk Benefits For Hair : వారంలో రెండు సార్లు జుట్టు కి కొబ్బరిపాలతో ఇలా చేయండి. జుట్టు సమస్యలను పక్కన పెడుతుంది.. చక్కటి ఫలితాన్నిస్తుంది.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యలలో జుట్టు సమస్య ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు రాలిపోవడం మరియు జుట్టు తెల్లబడటం వంటివి సాధారణ సమస్యగా అయిపోయింది. అయితే కొబ్బరి పాలను ఉపయోగించడం వల్ల జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు. జుట్టుకు కొబ్బరిపాలను ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యలలో జుట్టు సమస్య ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు రాలిపోవడం మరియు జుట్టు తెల్లబడటం వంటివి సాధారణ సమస్యగా అయిపోయింది. దీని నుండి బయటపడడానికి ప్రజలు ఏదో ఒక చికిత్స (treatment) తీసుకుంటున్నారు.
పోషకాహారం తీసుకోకపోవడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. పోషకాహారం తీసుకుంటూ కొన్ని ఇంటి చిట్కాలను పాటించినట్లయితే, జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
జుట్టు రాలే సమస్య నుండి బయటపడడానికి రెగ్యులర్ కేర్ కూడా తీసుకోవాలి. జుట్టు సమస్యలను నివారించడానికి కొబ్బరి నూనె బాగా పని చేస్తుంది. అయితే కొబ్బరి పాలను (Coconut Milk) ఉపయోగించడం వల్ల జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు.
సాధారణంగా కొబ్బరి పాలను ఆహార పదార్థాలలో ఉపయోగిస్తాం. కానీ కొబ్బరి పాలు జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కొబ్బరి పాలు సహజమైన మాయిశ్చరైసర్ ని కలిగి ఉంటాయి. బలహీనంగా ఉన్న జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది. కొబ్బరి పాలను జుట్టుకు (Hair) అప్లై చేయడం వల్ల జుట్టు రాలిపోవడం, చిట్లి పోవడం , చుండ్రు సమస్యలు వంటి వాటిని నివారిస్తాయి.
Also Read : Basil Benefits : జుట్టు సమస్యలకు తులసితో చెక్ పెట్టండిలా
ఈరోజు కథనంలో జుట్టుకు కొబ్బరిపాలను ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం.
జుట్టు అధికంగా రాలి పోతున్న వారు కొబ్బరి పాలలో, కొద్దిగా కర్పూరాన్ని (Camphor) వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి మర్దన చేయాలి. రెండు గంటల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీనిని వారంలో రెండు సార్లు ఉపయోగించవచ్చు. ఈ రెండు జుట్టు రాలే సమస్యను అరికడతాయి.
Also Read : Hair Growth : పూర్తి సహజ పద్దతులలో కేశ సంరక్షణకు ఇలా చేయండి.
జుట్టు నిర్జీవంగా మరియు డ్రై గా ఉంటే తలస్నానం చేసిన తర్వాత కండీషనర్ కు బదులుగా కొబ్బరి పాలను ఉపయోగించాలి. జుట్టు పొడి బారినప్పుడు జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల జుట్టు పొడిబార (Dry) కుండా ఉంటుంది. మరియు మెరుపును సంతరించుకుంటుంది.
కొబ్బరి పాల ను వారంలో రెండు లేదా మూడుసార్లు తలకు అప్లై చేయవచ్చు. కొబ్బరి పాలను జుట్టుకు (Hair) పట్టించి సున్నితంగా మర్దన చేసి ఒక గంట తర్వాత నాణ్యమైన మైల్డ్ షాంపుతో తల స్నానం చేయడం వల్ల జుట్టు సమస్యలు మొత్తం తొలగిపోతాయి.
Also Read : Bye Bye Hair Dye : హెయిర్ డై కి టాటా చెప్పండి, సహజ చిట్కాలతో తెల్ల జుట్టును నల్లబరచండి
తెల్ల జుట్టు సమస్య ఉన్నవారు కొబ్బరిపాలను జుట్టుకి వాడటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెరిసన జుట్టు (gray hair) ఉన్నవారు కొబ్బరిపాలు మరియు కొబ్బరి నూనె రెండింటిని కలిపి పట్టించాలి. ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్ల బడుతుంటే వారికి ఈ రెమిడి చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు తెల్ల బడడం ఆగిపోతుంది.
కాబట్టి జుట్టు సమస్యలు ఉన్నవారు మరియు లేనివారు కూడా కొబ్బరి పాలను తలకి ఉపయోగించవచ్చు. ఎందుకంటే జుట్టు ఎప్పుడూ ఆరోగ్యంగా, నల్లగా, దృఢంగా ఉండాలన్న మరియు జుట్టు సమస్యలు రాకుండా ఉండాలన్న కనీసం వారంలో రెండుసార్లు అయినా కొబ్బరి పాలను తలకి అప్లై చేయడం వలన జుట్టుకి మంచి పోషణ (nutrition)మరియు మెరుపుదనం సంతరించుకుంటాయి. కొబ్బరి పాలను జుట్టుకు వాడటం వల్ల చాలా వరకు జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు.
Comments are closed.