ప్రతి ఒక్కరూ తాము అందంగా ఉండాలని కోరుకోవడం సహజం. అమ్మాయిలు, మహిళలు తమ అందాన్ని సంరక్షించుకునే విషయంలో ప్రత్యేక శ్రద్ధ (Care) తీసుకుంటూ ఉంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కొక్కసారి ముఖంపై నల్లటి మచ్చలు, మొటిమలు, టాన్ (Tan) ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకనగా పని ఒత్తిడి మరియు వాతావరణం లో ఉండే కాలుష్యం (Pollution) వల్ల ఇటువంటి సమస్యలు వస్తుంటాయి.
మార్కెట్లో లభించే క్రీములు (Cream) వాడటం వల్ల మరియు వాటిలో ఉండే రసాయనాల వల్ల కొంతమందికి చెడు ప్రభావం కలుగుతాయి, తప్ప ఫలితం కనిపించదు. పార్లర్ (Parlor) కి వెళ్లి ఫేషియల్ మరియు బ్లీచింగ్ చేయించడం వలన దీర్ఘకాలిక ఉపయోగం ఉండదు.
Also Read : Eye Brows : మహిళల అందాన్ని మరింత పెంచే ఒత్తైన కనుబొమ్మలు కావాలంటే ఇలా చేస్తే సరి!
అటువంటి వారి కోసం ఇంట్లోనే తయారు చేసుకుని వాడే ఫేస్ ప్యాక్ (Face Pack) ని తెలియజేస్తున్నాం. దీనిని వాడటం వల్ల ముఖంపై వచ్చే మొటిమలు, నల్ల మచ్చలు తగ్గిపోతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
రాత్రి పడుకునే ముందు వారంలో రెండుసార్లు వాడటం వల్ల ముఖంలో నిగారింపు వస్తుంది. మొటిమలు వాటి తాలూకు ఏర్పడిన మచ్చలు తగ్గిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. మూసుకుపోయిన చర్మ రంధ్రాలు (Open pores) కూడా తెరుచుకుంటాయి.
కాఫీ పౌడర్ ని ఉపయోగించి తయారు చేసే ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు :
కాఫీ పొడి -ఒక స్పూన్, ఒక స్పూన్, నిమ్మరసం-ఒక స్పూన్ , తేనే- కొద్దిగా.
తయారీ:
ఒక గిన్నెలో ఈ పదార్థాలన్నీ వేసి పేస్టులా తయారు చేయాలి. ముఖాని (Face) కి మరియు మెడ (Neck) కి అప్లై చేసి ఆరిన తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తే కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగాల గురించి తెలుసుకుందాం.
ఈ ప్యాక్ లో కాఫీ పౌడర్ ని ఉపయోగిస్తున్నాం. కాఫీ పౌడర్ లో కెఫీన్ (Caffeine) ఉంటుంది. ఇది చర్మాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. కాఫీ పొడి (Coffee Powder) ఎక్స్ ఫోలియేటర్ గా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది చర్మం లోని మురికిని, జిడ్డుని తొలగించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా, అందంగా, తాజాగా మార్చడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కాఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు (Anti oxidant) సమృద్ధిగా ఉండటం వల్ల వృద్ధాప్యంలో వచ్చే ముడతలను నివారించడంలో తోడ్పడుతుంది.
Also Read : ఆరోగ్యంతో పాటు అందాన్నిచ్చే అరటిపండు, బనానా ఫేస్ ప్యాక్ తో చందమామ అందం మీ సొంతం
ఈ ప్యాక్ ఎండ నుండి వచ్చే ప్రమాదకరమైన అది నీలలోహిత కిరణాల (Blue Rays)నుండి చర్మాన్ని సంరక్షించడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ లో తేనె (Honey) ను కూడా ఉపయోగించాము. తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. మరియు నిమ్మరసం (Lemon) చర్మానికి బ్లీచింగ్ (Bleaching) లో పనిచేస్తుంది.
కాబట్టి ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలు, టాన్ ఉన్నవారు ఈ ఫేస్ ప్యాక్ ను వాడటం వలన అందమైన మరియు మెరిసే చర్మాన్ని (Glowing Skin) పొందవచ్చు.