Ifalcon Smart Tv : మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో చాలా మంది ఇళ్లకే పరిమితం అవుతారు. ఈ సమయంలో, ప్రజలు వినోదం కోసం టీవీ (Tv) చూస్తారు. ఈ రోజుల్లో, దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంది. అయితే, మీరు ఒక మంచి టీవీని కొనుగోలు చేయాలనుకుంటే, మార్కెట్లో కొన్ని మంచి స్మార్ట్ టీవీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ అయినా ఫ్లిప్ కార్ట్ (Flipkart) ఒక స్మార్ట్ టీవీ పై కళ్లు చెదిరే ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా రూ. 74 వేల స్మార్ట్ టీవీని కేవలం రూ. 28 వేల రూపాయలకే అందుబాటులోకి తెచ్చింది.
Also Read : Smartwatch Offers: భారీ తగ్గింపుతో స్మార్ట్ వాచ్‌లు..మార్కెట్లోని టాప్ ఆప్షన్స్ ఇవే.
మీరు ఈ కొత్త స్మార్ట్ టీవీని పొందాలనుకుంటే ఇదే మంచి సమయం అవుతుంది. ఈ కామర్స్ సంస్థ ఈ ఐఫాల్కాన్ (iFalcon) 55-అంగుళాల స్మార్ట్ టీవీపై ఊహించని డీల్‌ను ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ. 73,990 గా ఉంది, అయితే, ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ టీవీపై 61% తగ్గింపును ప్రకటించింది. కాబట్టి ఈ 55-అంగుళాల 4K స్మార్ట్ గూగుల్ టీవీని కేవలం రూ. 28,999 లకే సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ డీల్ పై మొత్తం రూ. 44,991 వరకు ఆదా చేసుకోవచ్చు.
ఐఫాల్కాన్ (iFalcon) 55 అంగుళాల అల్ట్రా HD 4K స్మార్ట్ Google TV ప్రస్తుతం చౌక ధరలో అందుబాటులో ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇది డాల్బీ ఆడియో, HDR10 మరియు Google అసిస్టెంట్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ మరియు ప్రైమ్ వీడియో యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. మిగతా యాప్స్ ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
Also Read : NEET PG 2024: నీట్-పీజీ ప్రవేశ పరీక్షలో మార్పులు, కొత్త తేదీలు ఇవే!
60Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 4K అల్ట్రా HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డాల్బీ ఆడియోతో 24 వాట్ల అవుట్‌పుట్ స్పీకర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ 2.0 ఫీచర్ కూడా ఇందులో ఉంది. మూడు హెచ్ డీఎంఐ (HDMI) 2.1 పోర్టులు, రెండు యూఎస్ బీ (USB) పోర్టులు, ఒక ఎథర్ నెట్ పోర్టు, ఎస్పీడీఐఎఫ్ (SPDIF) పోర్టు, బ్లూటూత్ ఇందులో ఉన్నాయి. డ్యూయల్ బ్యాండ్ వైఫైకి ఇది సపోర్ట్ చేస్తుంది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…