Credit Card Charges : అన్ని బిల్లులు క్రెడిట్ కార్డు నుండి చెల్లిస్తున్నారా? మే 1 నుండి కొత్త ఛార్జెస్.
రెంట్ పెమెంట్స్ పై చార్జీలు వసూలు చేసే క్రెడిట్ కార్డు జారీ కంపెనీలు ఇప్పుడు కొత్త గా అన్ని యుటిలిటీ బిల్లులపై ఛార్జెస్ వసూలు చేయబోతుంది.
Credit Card Charges : విద్యుత్ బిల్లులు, ఫోన్, గ్యాస్ లేదా నీటి బిల్లులను చెల్లించడానికి క్రెడిట్ కార్డ్ (Credit Cards)లను ఉపయోగిస్తున్నారా? అయితే , మీకు ఒక గమనిక. రెంట్ పేమెంట్ (Rent payment) తర్వాత క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసే యుటిలిటీ చెల్లింపులకు బ్యాంకులు అదనపు ఛార్జెస్ విధిస్తాయి.
ఇప్పటికే, యెస్ బ్యాంక్ (Yes Bank) మరియు IDFC ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) ఈ జాబితాలో చేరాయి. మే 1, 2024 నుండి తన క్రెడిట్ కార్డ్‌లతో చేసిన అన్ని చెల్లింపులకు అదనంగా 1% ఛార్జ్ విధిస్తారని బ్యాంక్ ప్రకటించింది. కస్టమర్లు యెస్ బ్యాంక్ నుండి రూ.15,000 మరియు IDFC ఫస్ట్ బ్యాంక్ నుండి రూ.20,000 ఉచిత క్రెడిట్ పరిమితిని పొందవచ్చు.
ఎస్ బ్యాంకు క్రెడిట్ బిల్ సైకిల్ లో రూ.15,000 కంటే తక్కువ యుటిలిటీ బిల్లులు చెల్లిస్తే, అదనంగా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ, రూ.15,000 కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లులు చెల్లిస్తే మాత్రం 1 % ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ కూడా 18% విధిస్తారు. అలాగే, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు కి ద్వారా కూడా యుటిలిటీ చెల్లింపులు జరిపితే 1 % ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది.
కానీ ఇది ఎస్ బ్యాంకు లాగా యుటిలిటీ బిల్లులు (Utility Bills) రూ.15,000 కాకుండా క్రెడిట్ ఫ్రీ – పరిమితి రూ.20,000కి చేసింది. ఇంతక ముందు క్రెడిట్ కార్డులు వినియోగిస్తే రివార్డులు ఇచ్చేవారు కానీ ఇప్పుడు చార్జెస్ విధిస్తున్నారు. BharatNXT వంటి యాప్ లు, వెబ్ సైట్ లు ద్వారా క్రెడిట్ కార్డులని ఉపయోగించి వ్యాపార చెల్లింపులు చేసుకోవచ్చు.
ఈ అదనపు చార్జెస్ పై సాధారణ వినియోగరాదారులు దిగులు చెందాల్సిన పని లేదు. యుటిలిటీ చెల్లింపుల కోసం అదనపు ఛార్జీలు విధించడం ప్రారంభించిన అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఉచిత క్రెడిట్ పరిమితులను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10,000 నుంచి రూ.20,000 వరకు ఉంది. ఉదాహరణకు, యెస్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్‌తో చేసిన యుటిలిటీ కొనుగోళ్లపై అదనంగా 1% వసూలు చేయనున్నట్లు మొదట ప్రకటించనప్పుడు, రూ.15,000 ఉచిత వినియోగ పరిమితి లేదు.
కారణం ఇదేనా ..
ఇంతక ముందు క్రెడిట్ కార్డులు వినియోగిస్తే రివార్డులు ఇచ్చేవారు కానీ ఇప్పుడు చార్జెస్ విధిస్తున్నారు. బ్యాంకులు ఎందుకు చార్జెస్ వసూలు చేస్తున్నారంటే ..యుటిలిటీ బిల్లులపై ఎండీఆర్(MDR) చాలా తక్కువగా ఉంటుంది. దాంతో, బ్యాంకుకు తక్కువ ఆదాయం వస్తుంది.అందుకే ఇలా చార్జెస్ విధించి ప్రత్యేక రుసుములు వసూలు చేయనున్నారు.
Comments are closed.