Crop protection, useful news : వేసవిలో పంట రక్షణ తప్పనిసరి, లేదంటే నష్టమే మరి! ఈ జాగ్రత్తలు తీసుకోండి
వేసవిలో పంటకు నీటి కొరత ఏర్పకుండా జాగ్రత్తలు వహించాలి. తగిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం.
Crop protection : వేసవి కాలం వచ్చేసింది.. ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతున్నాయి.. వేడిగాలులు అధిక ఉష్ణోగ్రత కారణంగా ప్రజలు అడుగు బయటపెట్టాలంటే భయపడుతున్నారు. ఎండకి తట్టుకోలేక ఇంట్లో నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక పంటల విషయానికి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పంట నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పంటను కాపాడేందుకు తగిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.
వేసవిలో పంటకు నీటి కొరత ఏర్పకుండా జాగ్రత్తలు వహించాలి . ముఖ్యంగా, డ్రిప్ ఇర్రిగేషన్ సిస్టంని ఉపయోగిస్తే ఎల్లప్పుడూ నేల తేమగా ఉంటుంది. దాంతో, నీటి కొరత ఏర్పడదు.
పంట సాగుచేసేటప్పుడు పంట మార్పిడి చేయడం మంచిది. ఒకేరకమైన పంటను వేయడం వల్ల భూ సారం తగ్గి, పంటపై చీడ పురుగులు , తెగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. పంట మార్పిడి చేయడం వల్ల భూసారం పెరుగుతుంది.
నేలని ఆరోగ్యంగా ఉంచేందుకు సేంద్రీయ ఎరువులు వాడడం మంచిది. దీంతో భూసారం పెరుగుతుంది. సేంద్రీయ ఎరుగువులు వాడడం వల్ల నేల సారవంతంగా ఉండడమే కాకుండా తేమతో నిండి ఉంటుంది. పంటకు నష్టం వాటిల్లకుండా సూక్ష్మజీవులు సహాయ పడతాయి.
ఎక్కువ వేడి, ఉష్ణోగ్రతల కారణంగా పంటను కాపాడుకునేందుకు షేడ్ నెట్ ని ఉపయోగించడం మంచిది. సూర్యరశ్మి నేరుగా పంట మీద పడకుండా పంటని కాపాడి అనుకూల వాతావరణాన్ని ఏర్పడేలా చేస్తుంది.
పంట చుట్టూ ఉపరితలంపై ఎండు గడ్డి, కంపోస్ట్ వేయడం మంచిది. ఎందుకంటే, అవి తేమ శాతాన్ని తగ్గించకుండా ఉంచుతుంది. దీంతో పంట నష్టం జరగకుండా పంట ఎదుగుదలకు సాయం చేస్తుంది. కలుపు మొక్కలు కూడా అధికంగా పెరగకుండా చూస్తుంది.
తెగుళ్లు వస్తున్నాయా లేదా అని పంటను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి.
వేసవి కాలంలో నీటి వాడుక తక్కువగా ఉండే పంటలను పండించడం మంచిది. మీ ప్రాంతంలో వాతావరణానికి తగ్గట్టుగా వేడిని తట్టుకునే పంటలను పండించడం మంచిది. దాంతో ఎండా కారణంగా దెబ్బతినే అవకాశాలు చాల తక్కువగా ఉంటాయి.
దేశంలో అధిక ఎండలు
భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం, ఈ వేసవిలో వివిధ రాష్ట్రాలలో వేడి గాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉంది. మే లో వేడి అధికంగా ఉండే ఉంటుంది. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, తెలంగాణ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వేడిగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తమ పంటలను కాపాడుకోవాలని సూచించారు.
Comments are closed.