బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను (Cyclone Michaung) ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం రాత్రి 11.30కి తీరం (the coast) దాటింది. సరిగ్గా నెల్లూరులోని ముత్తుకూరు దగ్గర తుఫాన్ తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
ఇది ఇవాళ ఒంగోలు, చీరాల, వినుకొండ, పిడుగురాళ్ల, డిచ్‌పల్లి వైపుగా సాయంత్రానికి మిర్యాలగూడ దగ్గర నుండి మంగళవారం అర్థరాత్రి తర్వాత తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. బుధవారం ఉదయం 11 గంటలకు వరంగల్ వైపుగా వెళ్తుందని ప్రస్తుత అంచనాలు (Expectations) చెబుతున్నాయి. ఆ సమయానికి గాలుల వేగం గంటకు 45 కిలోమీటర్లుగా ఉండవచ్చని తెలుస్తోంది.
భారత వాతావరణ విభాగం (IMD) మిచౌంగ్ తుఫాను గురించి విడుదల చేసిన తాజా బులిటెన్‌లో ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వెళుతుందని అలాగే ఈ రోజు (డిసెంబర్ 5) ఏపీ, తెలంగాణ లలో అతి భారీ వర్షాలు (Heavy rains) ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీలో రాయలసీమలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోని చాలా ప్రాంతాలు ప్రళయ భీకరంగా మారాయి. ఎక్కడ చూసినా వరద నీరు ఉంది. రేపటి నుండి (బుధవారం) వర్షాల తీవ్రత (Intensity of rains) తగ్గుతుందనీ, అలాగే తుఫాను కూడా.. బలహీనపడి వాయుగుండంగా మారుతుందని IMD పేర్కొంది.
ఈ రోజు నెల్లూరు, ఒంగోలు, కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, మార్కాపురం, చీరాల, గూడూరు, మచిలీపట్నం, దర్శి, రేపల్లెకు అతి భారీ వర్ష సూచన ఉంది. ప్రస్తుతం ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజంతా తెలుగు రాష్ట్రాల్లో వర్షం పడుతుంది.
వాయవ్య తెలంగాణ, పశ్చిమ రాయలసీమలో మాత్రమే తుఫాను ప్రభావం అంతగా ఉండదు. మిగతా అన్ని ప్రాంతాలకూ వర్ష సూచన (Rain forecast) ఉంది. మంగళవారం ఉదయం 11 గంటలకు తుఫాను ఒంగోలును చేరుతుంది. అప్పుడు చీరాల, ఒంగోలు, మచిలీపట్నం, విజయవాడ, ఏలూరు, ఖమ్మం, మార్కాపురం, నర్సారావు పేటలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇవి రాత్రి 8 గంటల వరకూ ఇలాగే కురుస్తాయి. మిగతా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇవాళ రాత్రి 6 గంటల తర్వాత.. తుఫాను గాలుల తీవ్రత తగ్గి, గాలుల వేగం గంటకు 95 కిలోమీటర్లుగా ఉంటుందని అప్పుడు కూడా పైన పేర్కొన్న అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. తెలంగాణలో కూడా ఈ రోజు దక్షిణ, తూర్పు, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి (mild) నుంచి మోస్తరు వర్షాలు కురవ నున్నాయి.
Also Read : ఢిల్లీలో 24 గంటల సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 375 వద్ద పేలవమైన కేటగిరీలోకి చేరుకుంది.
బంగాళాఖాతం నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఏపీలోకి వస్తున్న గాలులు.. తుఫాను కారణంగా.. మిచౌంగ్ చుట్టూ సుడిలాగా తిరుగుతున్నాయి. ప్రస్తుతం గంటకు 110 కిలోమీటర్లుగా మిచౌంగ్ దగ్గర గాలుల వేగం (wind speed) ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో సముద్ర తీరం అల్లకల్లోలం (mayhem) గా మారింది. మిచౌంగ్ తుఫాను ప్రభావం ఏపీపై బాగా కనిపిస్తోంది. తీర ప్రాంత జిల్లాలు బాగా ప్రభావితమవుతున్నాయి.
ఆంధ్ర, తెలంగాణాలలో పలు జిల్లాలలో ప్రభుత్వ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు, తీర ప్రాంత ప్రజలను, తుఫాను ప్రభావిత (Affected) ప్రాంతాలలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలలోని అధికారులు ఎప్పటికప్పుడు భారత వాతావరణ శాఖ అందించే అప్ డేట్ల ప్రకారం తుఫాన్ పై అప్రమత్తం చేస్తున్నారు.