Guppedantha Manasu serial feb 7th episode : రిషి ఫోటోకి దండ, గోల చేసిన వసు, అనుపమ-ముఖుల్ అనుమానం భద్రనేనా
ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
Telugu Mirror : తెలుగు టీవీ సీరియల్స్ లో గుప్పెడంత మనస్సు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉన్న సీరియల్స్ లో ఒకటి. ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
రిషిని తీసుకొస్తా అని చెప్పి వసుధార బయటికి వెళ్తుంది. ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తుండగా రాజీవ్ వచ్చి పెళ్లి చేసుకుంటానని చికాకు చేస్తాడు.వసుధారని అక్కడ నుండి లాక్కొని వెళ్తుండగా మరో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. రాజీవ్ నుండి వసుధారని కాపాడతాడు. మిమ్మల్ని ఎక్కడ దింపాలి అని అతను వసుని అడుగుతాడు. ఎక్కడికి వెళ్లాలో నాకు కూడా తెలీదు, థాంక్స్ అని చెప్పి వెళ్తుంది వసు.
రిషి ఫోటోకు దండ..
వసుధర ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, రిషి ఫోటోకి ఒక దండ వేసి ఉంటుంది. ఫోటో ముందు కూర్చున్న మహేంద్ర, ధరణి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ దృశ్యం వసుధరకు కోపం తెప్పిస్తుంది. రిషి సర్ ఫోటోకి ఎవరు దండ వేశారు? అని చెప్పు దండ తీసి పారేస్తోంది. వసుధర రిషి ఫోటోకి నువ్వు ఎక్కడో క్షేమంగా ఉన్నావు కానీ వాళ్ళకి తెలియకుండా ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెబుతుంది.
రిషి సర్ కి ఏం కాలేదు అని చెబితే నన్ను ఎందుకు నమ్మడం లేదని వసుధర అందరినీ ప్రశ్నిస్తుంది. ఫోటోను ఎవరు అలంకరించారో చెప్పండి అని వసు కోపంగా అడుగుతుంది.
దేవయాని రిషి నా కొడుకు అని ప్రేమగా ఉన్నట్లు నటిస్తుంది కానీ అతను ఆమెను ఎలా విడిచిపెట్టాడో అని అడుగుతుంది. కోపం వచ్చినప్పుడు వసుధర మాటలు అదుపు తప్పుతాయి. రిషి సార్ లేడు అని ఎవరైనా అంటే ఏమి చేయాలో నాకు తెలియదు అని వసు అంటుంది. శైలేంద్ర ఏదో చెప్పాలని నోరు విప్పాడు. వసుధర అతన్ని ఆపింది.
నీకు మాట్లాడే హక్కు లేదని వసు గట్టిగా అరుస్తుంది.వాస్తవాన్ని ఎదుర్కోవాలని అని దేవయాని వసుధారకు చెబుతుంది. నువ్వు మాయలో ఉన్నావ్ అని దేవయాని అంటుంది. నేను కాదు మాయలో ఉంది మీరే మాయలో ఉన్నారు అని వసు అంటుంది. రిషి సార్ రావాలి ఇక్కడ తేల్చే లెక్కలు కొన్ని ఉన్నాయి అని శైలేంద్ర ముఖం చూసి చెబుతుంది వసుధార.
దేవయాని రిషి ఫోటోను ఎక్కడి నుంచి తీసిందో అక్కడ పెట్టమని అడుగుతుంది. అయినా వసుధర ఒప్పుకోలేదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను రమ్మని ఎవరు అడిగారు? అని వసుధార అడుగుతుంది. మీలాంటి వాళ్ళు ఋషి సార్ ని ఎక్కడో దాచిపెట్టి చనిపోయినట్లు నటిస్తున్నారని వసుధర దేవయానిని తిడుతుంది. వసుధర శైలేంద్ర మరియు దేవయానిని అరుస్తూ, ఇక్కడ నుండి వెళ్లిపోండి అని అరుస్తుంది. శైలేంద్ర, దేవయాని, ధరణి అక్కడ నుండి వెళ్ళిపోతారు.
అనుపమ, ముఖుల్ అనుమానాలు…
అనుపమ రిషి హత్య గురించి ముకుల్ దగ్గరికి వెళ్ళింది. రిషి నిజంగానే చనిపోయాడా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉందా? అనుపమ ముకుల్ ని విచారణను సరిగ్గా చేశారా? లేదా కేసులో ఏమైనా లోపాలు ఉన్నాయా అని అడుగుతుంది. ముకుల్ స్పందిస్తూ, “నేను అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, రిషి చనిపోయాడని నిర్దారించాను.” అని ముఖుల్ చెప్పాడు. శైలేంద్ర చేయి ఏమైనా ఉందా అని అనుపమ అడుగుతుంది. లేదు మేడం కానీ భద్ర చేసి ఉంటాడా అని అనుమానంగా ఉంది అని అంటాడు ముఖుల్.
Comments are closed.