Telugu Mirror : మహిళలు తమ చర్మాన్ని అందంగా ఉంచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది తమ చర్మం(Skin Glow) నిగారింపు కోసం పార్లర్ కి వెళ్లే డబ్బు మరియు సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఇంటి చిట్కాలు అనుసరించి చర్మం ను కాంతివంతంగా మార్చుకుంటూ ఉంటారు. పార్లర్ కి వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే పార్లర్ లో వచ్చే నిగారింపును పొందవచ్చు .ఎలాగా అంటే మన దేశీ నెయ్యి(Desi Ghee) తో. ఆవుపాలతో చేసిన దేశీ నెయ్యి ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యకరం. అలాగే చర్మానికి కూడా మేలు చేస్తుంది.
ఈ దేశీ నెయ్యిలో విటమిన్ బి-12, విటమిన్ ఏ ,విటమిన్ డి ,విటమిన్ ఇ మరియు విటమిన్ కె అలాగే బ్యూట్రిక్ ఆసిడ్ సమృద్ధిగా ఉన్నాయి .
ఇవి శరీరానికి మరియు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు దేశీ నెయ్యి ఎలా వాడాలో, అలాగే దాని వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం.దేశీ నెయ్యి వాడడం ద్వారా పొడి చర్మాన్ని తొలగించుకోవచ్చు.
conjunctivitis: వానాకాలం లో కండ్ల ‘కలక’లం. Dr .చింతా ప్రభాకర్ గారు చెప్పే జాగ్రత్తలతో మటు మాయం.
ఈ నెయ్యిలో ఒమేగా ఆసిడ్స్(Omega Acids) మరియు విటమిన్లు ఉండటం వల్ల ఇవి చర్మాన్ని సహజంగానే హైడ్రేట్ చేస్తాయి. మీ శరీరం పొడి చర్మం అయితే సాధారణ చర్మం గా మార్చడానికి ఉపయోగపడుతుంది .మీరు ఈ నెయ్యితో మసాజ్ చేసుకుంటే చర్మం లో తేమ అలాగే ఉంటుంది.
దేశీ నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు(antioxidants) ముఖంపై ఉన్న మచ్చలను నివారిస్తుంది. ఇది మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఇది చర్మంపై ఉన్న ముడతలను తగ్గిస్తుంది. మరియు ఫైన్ లైన్ లను కూడా నివారిస్తుంది.
Cancer : అలర్ట్.. అధిక చక్కెర అత్యంత ప్రమాదం..కాన్సర్ కు కారణమవ్వనుందా ?
చాలామంది పెదవులు ఎండిపోయి పగిలిపోతుంటాయి. అటువంటి సందర్భంలో మీరు రాత్రి సమయంలో మీ పెదవులపై నెయ్యి రాసుకొని నిద్రపోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల మీ పెదవులు అందంగా తయారవుతాయి. మీ పెదవులపై పొట్టు వస్తుంటే ఈ నెయ్యి రాయడం వలన సమస్య తొలగిపోతుంది మరియు పెదవులు మృదువుగా ఆరోగ్యంగా ఉంటాయి.తరచుగా మీరు దేశీ నెయ్యి చర్మానికి అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది మరియు చర్మంపై నిగారింపు వస్తుంది.