Baby Movie: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బేబీ .. తెర వెనుక రహస్యాలు మీకు తెలుసా ?

Telugu Mirror: సినీ ఇండస్ట్రీలో మారుమోగుతున్న సినిమా బేబీ(Baby). ఈ చిన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో అలరించి అద్భుత విజయాన్ని సాధించి అందరి ప్రశంసలు కురిపిస్తున్నది. ఏ అంచనాలు లేకుండా విడుదల ఐన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్(Block Buster Hit)తో అందరి ముందుకు వచ్చి మరిన్ని లాభాలను తెచ్చి పెట్టింది. సాయి రాజేష్ దర్శకత్వం లో ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) హీరోగా మరో ముఖ్య పాత్రలో విరాజ్(Viraj), హీరోయిన్ గా వైష్ణవి చైతన్య(Vyshnavi Chiaitanya)నటించిన ఈ సినిమా కు SKN నిర్మాత గా వ్యవహరించారు.SKN గారు కింది స్థాయి నుండి కష్టపడి పైకి వచ్చి మంచి నిర్మాతగా పేరుపొందిన విషయం అందరికి తెలిసిందే. జులై 14 న విడుదలలైన ఈ సినిమా ఇప్పటికే మంచి కలెక్షన్స్ ని తీసుకువస్తుంది . ఇండస్ట్రీ లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న SKN గారికి బేబీ మూవీ షూటింగ్ సమయం లో ఎన్నో ఇబ్బందులను ఎదురుకున్నారు .

Also Read:MegaStar Chiranjeevi : తెలుగు సినిమా చరిత్రలో చెరగని చిహ్నం..

SKN గారు బేబీ మూవీ కంప్లీట్ ప్రొడ్యూసర్ గా నిరూపించుకోవాలని అల్లు అరవింద(Allu Aravind)దగ్గర కొంత అప్పు తెచ్చి బేబీ మూవీ షూటింగ్ మొదలు పెట్టారు . అయితే హీరోయిన్ సెట్ వేసి 20 రోజులు షూట్ చేసాక షూటింగ్ కి అనుమతి లేదని చెప్పడం తో మల్లి కొత్త సెట్ తాయారు చేసి షూట్ చేయడానికి బడ్జెట్ అనేది సరిపోలేదు. దిక్కు తోచని స్థితిలో SKN గారు నెల రోజుల్లో గృహ ప్రవేశం పెట్టుకున్న ఫ్లాట్ ని అమ్మి బేబీ షూటింగ్ కి దొబ్బులు తీసుకొచ్చారు . బేబీ మూవీ మీద తనకి ఉన్న నమ్మకమే ఈరోజు ఆ మూవీ బ్లాక్ బస్టర్(Block Buster)కి కారణమయిందనే చెప్పొచ్చు.

Baby movie secrets behind screen
Image Credit: Telugu One

అయితే ఇది ఇలా ఉండగా బేబీ మూవీ ని 10. కోట్లతో తీస్తే 50 కోట్ల వసూల్లను సాధించింది . అయితే సినిమా లో ప్రధాన నటులు(lead actors ) కు ఇచ్చిన రెమ్యూనరేషన్ కు సంబందించిన వివరాలు బయటకు వచ్చాయి. అందులో విరాజ్ అశ్విన్ కు 20 లక్షలు , హీరోయిన్ వైష్ణవి చైతన్య కు 30 లక్షలు హీరో ఆనంద్ దేవరకొండ కు 80 లక్షలు ఇవ్వగా సోషల్ మీడియా లో మరి ఇంత తక్కువ రెమ్యూనరేషనా అంటూ గోల చేస్తున్నారు .

ఏదైతేనేం మొత్తానికి మొదటి ప్రేమకు చావు లేదు ఆ ప్రేమ ఎప్పటికి గుండెల్లో సమాది చేయబడుతుంది అనే భావన తో యూత్ కి ఎంతగానో దగ్గరయిన బేబీ మూవీ బ్లాక్ బస్టర్ కావడం సంతోషకరమైన విషయం.

Leave A Reply

Your email address will not be published.