సంతోషం, బాధ, కోపం, దుఃఖం ఇవన్నీ మనిషిలో సహజంగా ఉండే భావోద్వేగాలు. ఇవే కాకుండా భావోద్వేగాలలో అసూయ (Jealousy) కూడా ఒకటి. మిగిలిన భావోద్వేగాల వల్ల అంతగా ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ అసూయ మాత్రం మిమ్మల్ని లోపల నుండి కాల్చి (burn) వేస్తుంటుంది.
దీని ప్రభావం మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మనిషికి అసూయ అనే భావోద్వేగం (emotion) ఉంటే అది అంత సులువుగా పోదు. ఇతరులపై ఎల్లప్పుడూ అసూయతో ఉంటే మానసిక ప్రశాంతతను కోల్పోతారు.
మీకున్న బలాన్ని మరియు నైపుణ్యాన్ని (Skill), సృజనాత్మకత (Creativity) ను కూడా కోల్పోవడం జరుగుతుంది. ఎందుకనగా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు.
ఈ విధంగా ఉండడం వల్ల మీ అభివృద్ధి కుంటు పడుతుందని మానసిక నిపుణులు (Psychiatrists) చెబుతున్నారు. కాబట్టి అసూయ అనే భావనను వీలైనంతవరకు దూరం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎవరికైనా అసూయ భావన ఉన్నట్లయితే దానిని దూరం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం.
అస్సలు అసూయ అనే భావన ఎందుకు కలుగుతుందో ఆ మూలాన్ని గుర్తించాలి. ఆత్మవిశ్వాసం (self confidence) తగ్గిపోతుందా? లేదా మరి ఏదైనా కారణం ఉందా అనే విషయం తెలుసుకోవాలి.
Also Read : Vaastu Tips : ప్రశాంత జీవితం కొనసాగాలంటే ఇంటిలో ఈ నియమాలను పాటించండి.
అసూయ మూలాన్ని (origin) కనిపెట్టిన తర్వాత దాని నుండి బయటపడడానికి ఏం చేయగలం అని ఆలోచించే ప్రయత్నం చేయాలి.
అసూయ భావన రావడానికి ట్రిగ్గర్స్ (Triggers) ఏంటి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ట్రిగ్గర్ లను గుర్తిస్తే అసూయ ను అదుపులో ఉంచవచ్చు.
అసూయ అనేది ఎటువంటి పరిస్థితులలో వస్తుందో తెలుసుకొని ఆ విషయాన్ని గుర్తించి అటువంటి సంఘటనకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అసూయ కలుగుతున్న విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో చర్చించాలి.
కుటుంబ సభ్యులతో ఏర్పడిన అసూయను మీ జీవిత భాగస్వామితో పంచుకోవడం ద్వారా కొంత వరకు కంట్రోల్ చేయవచ్చు. అసూయను తరిమికొట్టాలంటే జీవితం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి.
రెప్పపాటు జీవితం కనుక జీవించినంత కాలం సంతోషంగా జీవించాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ జీవిత సత్యాన్ని(truth of life) అర్థం చేసుకున్నట్లయితే అసూయ అనే భావన ఉండదు.
అసూయ అనేది ఒక నెగిటివ్ ఎమోషన్. దీనిని మనం పాజిటివ్ గా మార్చుకోవచ్చు. ఇలా మార్చుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి (higher level) ఎలా ఎదగాలనే కసితో ముందుకు వెళ్లొచ్చు.
Also Read : Change in life: జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు ‘మార్పు’ యొక్క పాత్ర ఏమిటో మీకు తెలుసా ?
మన కన్నా ఎక్కువగా ఉన్న ధనవంతుల ను చూసి అసూయ పడడం కన్నా, మనకన్నా పేదవారి (poor)ని చూసి “మనం నయమే కదా” అనే పాజిటివ్ ఎమోషన్స్ తో జీవించడం అలవాటు చేసుకోవాలి.
చదువు, ఉద్యోగం, సంపాదన, అందం ఇలా ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరికి తేడాలు ఉండడం సర్వసాధారణం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇటువంటి విషయాలపై అతిగా ఆలోచించడం వల్ల మనసు పాడవుతుంది. దీంతో మానసిక ఆరోగ్యం దెబ్బతినే (health damage) అవకాశం అధికంగా ఉంటుంది.
కాబట్టి అందరూ బాగుండాలి అనే మనస్తత్వం కలిగి ఉండాలి. జీవితాన్ని(calmly) గడపాలి. ఉన్నదానితో సంతృప్తి పడాలి. అప్పుడే జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగి పోతారు.
కాబట్టి వీలైనంతవరకు ఈర్ష్య, ద్వేషం, అసూయ వీటిని మన మైండ్ లోనికి రానివ్వ కూడదు. లేదంటే వాటి వలన మన జీవితం ప్రమాదంలో పడుతుంది అనే విషయాన్ని గుర్తించాలి.