Telugu Mirror : చైనా లోని దక్షిణ ప్రాంతంలో అయినా షిన్జాంగ్ లో సోమవారం అర్ద రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.2గా నమోదయింది. ఈ భూకంపం 80కిలో మీటర్ల లోతులో ఉన్నట్లు సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది. కజికిస్థాన్ లో ఇదే భూకంపం 6.7 తీవ్రతతో కంపించిందని నివేదిక వెల్లడించింది.
జిన్ జియాంగ్ లో భారత కాలమానం ప్రకారం రాత్రి 11: 29 గంటలకు భూకంపం సంభవించినట్లు భూకంప శాస్త్ర నివేదిక తెలిపింది. దీని ప్రకంపనలు భారత రాజధాని అయిన ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉన్నట్టు సమాచారం అందింది. ఈ భూకంపం వలన అనేక మంది ప్రజలు గాయపడ్డారని, ఇంటి నష్టం వాటిళ్లిందని సమాచారం అందింది. చైనా వాయువ్య ప్రాంతంలో భూకంప కేంద్రంగా ఉన్న వుషి కౌంటీకి దగ్గర్లో 3.0 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతలో భూమి కంపించింది. కజకిస్థాన్, ఉజ్బేకిస్థాన్ లో సంభవించిన భూకంపానికి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించిన ఇంకా వెలుగులోకి రాలేదు.
Earthquake of Magnitude:7.2, Occurred on 22-01-2024, 23:39:11 IST, Lat: 40.96 & Long: 78.30, Depth: 80 Km ,Location: Southern Xinjiang, China for more information Download the BhooKamp App https://t.co/FYt0ly86HX@KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/E184snmSyH
— National Center for Seismology (@NCS_Earthquake) January 22, 2024
ఈ భూకంప తీవ్రత 80 కిలో మీటర్ల వరకు కనిపించినందున, జిన్ జియాంగ్ రైల్వే శాఖ కార్యకలాపాలను ఆపివేసినట్లు అధికారులు వెల్లడించారు. రెండు గంటల వ్యవధిలోనే భూమి 14 సార్లు కంపించింది. భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర చలిలో కూడా పరుగులు తీశారు. దీని ప్రభావం వల్ల 27 రైళ్లు రద్దు చేసారు. ఘటనా స్థలానికి అక్కడి స్థానిక సిబ్బందిని పంపించినట్టు తెలిసింది.
దేశ రాజధానిలో భూ ప్రకంపనలు..
మన దేశ రాజధాని అయిన ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో భూమి కంపించింది. ఈ నెల ఢిల్లీ లో భూకంపం రావడం ఇది రెండో సారి. ఈ నెల 11 న ఆఫ్గనిస్తాన్ లో భూమి 6.1 తీవ్రతతో కంపించింది. దాని ప్రకంపనలు ఢిల్లీలో మరియు పలు ప్రాంతాల్లో కూడా సంభవించాయి.
చైనాలో ప్రకృతి వైపరీత్యాలు..
ప్రకృతి విపత్తులు చైనాని వణికిస్తున్నాయి. చైనా నైరుతి ప్రాంతంలో భూకంపం సంభవించగా అక్కడి కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ప్రభావంతో అక్కడ 47 మంది ప్రాణాలు కోల్పోగా మరో 200 మందిని సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. చైనాలో ఒక్కోసారి చలి తీవ్రంగా ఉంటుంది మరో సారి ఇలాంటి భూకంపాలు భయపెడుతూ ఉంటాయి. చైనా ప్రజలు ఎప్పుడు ఏం సంభవిస్తుందో అని బిక్కుమంటూ నివసిస్తున్నారు.