Telugu Mirror: ప్రతి ఒక్కరు ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. మనం తినే ఆహారం, మన ఆరోగ్యం పై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఫాస్ట్ ఫుడ్ (Fast Food) మరియు ప్రాసెస్ ఫుడ్ (Process Food) వల్ల మన శరీరానికి అధికంగా నష్టం వాటిల్లుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.
ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరం వేగంగా బరువు పెరగడమే కాకుండా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను కూడా పెంచుతాయి. ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇవి శారీరక మరియు మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయి.
ఫాస్ట్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్స్ లో క్యాలరీలు ఎక్కువగా ఉండటం వలన చాలా త్వరగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఇదే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. వీటివల్ల శరీరంపై చెడు ప్రభావం అధికంగా ఉంటుంది.
ఫాస్ట్ ఫుడ్స్ వల్ల వచ్చే ఆరోగ్య ఇబ్బందుల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చేఅత్యంత ప్రమాదకరమైన సమస్యలలో మొదటిది ఊబకాయం. ఈ ఫుడ్ వల్ల చాలా వేగంగా బరువు పెరుగుతారు. బర్గర్లు, నూనెలో వేయించిన ఫ్రై పదార్థాలు మరియు ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలు అలాగే వేయించిన ఆహార పదార్థాలలో ఉండే కొవ్వు, వీటి వలన బరువు పెరుగుతారు. మీరు వీటిని అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు గుండె జబ్బులు మరియు డయాబెటిస్ (Diabetes) వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేలా చేస్తాయి.
తరచుగా ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల రక్తపోటును (Bloodpressure) పెంచవచ్చు. ఇటువంటి ఆహారంలో సోడియం మోతాదు ఎక్కువగా ఉంటుంది. అందువలన నేరుగా ప్రభావం పడుతుంది. దీనిని తక్కువ మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సోడియం ఎక్కువగా తీసుకుంటేరక్త పోటు ను పెంచడంతోపాటు రక్తనాళాలకు కూడా హానికరం. ఇది గుండె ఆగిపోవడం మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా అధికం చేస్తుంది.
ఫాస్ట్ ఫుడ్స్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని మీ శరీరం గ్లూకోజుగా విడదీస్తుంది .శరీరంలో బ్లడ్ షుగర్ యొక్క స్థాయిని, అనియంత్రిత స్థాయిలను కలిగి ఉండి అనేక రకాల ఆరోగ్య ప్రమాదాలను పెంచుతాయి.
కాలం గడిచే కొద్దీ అధిక చక్కెరస్థితి అనగా ప్యాంక్రియాస్ (ఇన్సులిన్ తయారు చేసే అవయవం) కోసం ఇబ్బందులను మరింత ఎక్కువ చేస్తుంది.
కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఫాస్ట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి అని వైద్యులు సూచిస్తున్నారు.