TS Inter Results 2024, Useful news : సోమవారమే టీఎస్ ఇంటర్ ఫలితాలు వెల్లడి.. ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) ఫలితాలను సోమవారం లేదా మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది.

TS Inter Results 2024 : తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) ఫలితాలను సోమవారం లేదా మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 మధ్య ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈసారి 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

“సమాధాన పత్రాలు మూల్యాంకనం  పూర్తి అయింది, ఫలితాలు కూడా ప్రాసెస్ చేశారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రస్తుతం ఫలితాలను విడుదల చేయడానికి ముందే పరీక్షిస్తోంది. బోర్డు సోమవారం లేదా మంగళవారం ప్రకటించాలని భావిస్తోంది.

ఎన్నికల కారణంగా ఫలితాలు తొందరగా..

దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున, ఇంటర్ పరీక్షల మూల్యాంకనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది.

TS Inter Results 2024

వీరిలో 4,78,527 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు కాగా 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు కొనసాగుతుండగానే అధికారులు మార్చి 10న మూల్యంకన ప్రక్రియను ప్రారంభించారు. మూల్యాంకన ప్రక్రియ మొత్తం నాలుగు దశల్లో నిర్వహించగా.. ఏప్రిల్ 10 నాటికి ముగిసింది.

TS ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలు 2024 ఎలా చెక్ చేయాలి.

  • అధికారిక వెబ్‌సైట్,http://tsbie.cgg.gov.in కి వెళ్లండి.
  • హోమ్‌పేజీలో ‘Telangana Inter Results 2024’ లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీరు మొదటి సంవత్సరం విద్యార్థి అయితే, “TS ఇంటర్ 1వ సంవత్సరం ఫలితాలు 2024” లింక్‌పై క్లిక్ చేయండి. మీరు రెండవ సంవత్సరం విద్యార్థి అయితే, “TS ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాలు 2024″పై క్లిక్ చేయండి.
  • మీ TS ఇంటర్ 2024 హాల్ టిక్కెట్ నంబర్‌ను నమోదు చేయండి.
  • ‘Get Result’ బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ ఇంటర్ ఫలితాలు కనిపిస్తాయి.
  • డౌన్‌లోడ్ చేసిన తర్వాత, భవిష్యత్తు సూచన కోసం తెలంగాణ ఇంటర్ ఫలితాల 2024 కాపీని ప్రింట్ చేయండి.
TS Inter Results 2024

Comments are closed.