గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ క్రమం తప్పకుండా గుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య (sick) సమస్యలు రాకుండా ఉంటాయి. గుడ్లు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుడ్డులో ప్రోటీన్, క్యాల్షియం, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక గుడ్డు తినడం అలవాటు చేసుకోవాలి. ఉడికించిన గుడ్డు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. జిమ్ మరియు వ్యాయామం చేసేవారు కూడా గుడ్డు (Egg) తినడం మంచిది.
అయితే చాలామంది గుడ్లు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తారు. కానీ గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ (store) ఉండవు. కాబట్టి గుడ్లు ఎక్కువ రోజులు చెడిపోకుండా తాజాగా నిల్వ ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించడం వలన గుడ్లను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు. అవి ఏమిటో తెలుసుకుందాం.
చాలామంది గుడ్లను ఫ్రిజ్ లో పెడుతుంటారు. ఇలా చేయడం తప్పు. ఎందుకంటే గుడ్డు షెల్ లోపల సాల్మొనెల్లా (Salmonella) అనే బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి గుడ్లను ఫ్రిజ్ లో ఉంచితే ఈ బ్యాక్టీరియా గుడ్ల పైనే కాకుండా ఫ్రిజ్ లో ఉన్న ఇతర ఆహార పదార్థాలపై కూడా వ్యాపిస్తుంది. కాబట్టి గుడ్లను ఫ్రిజ్ లో నిల్వ చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
గుడ్లు ఎక్కువ రోజుల తాజాగా ఉండాలంటే గుడ్లను కలవకుండా ఉంచాలి. ఖాళీగా, వెడల్పుగా ఉండే స్థలంలో గుడ్లను ఉంచి వాటిపై మూత పెట్టాలి. ఇలా చేయడం వల్ల గుడ్లు కదలకుండా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పాతకాలంలో ఖాళీ పాత్రలో గడ్డి వేసి అందులో గుడ్లను ఉంచేవారు. ప్రస్తుత రోజుల్లో గడ్డి (grass) లభించడం కష్టం కాబట్టి పైన చెప్పిన విధంగా చేయడం వల్ల గుడ్లను ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంచుకోవచ్చు.
Also Read : World Egg Day : గుడ్డు తో కలిపి తినకూడని పదార్ధాలు మీకు తెలుసా?
EGGS : మితంగా తీసుకుంటే ఆరోగ్యం, మితిమీరితే అనారోగ్యం. పోషక నిలయం గుడ్డు లో మంచి,చెడు
గుడ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వంటకు ఉపయోగించే నూనెను గుడ్డు పెంకు పై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల గుడ్లు పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
గుడ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే గుడ్లను టిష్యూ పేపర్లో చుట్టి భద్రపరచాలి. ఇలా చేయడం వల్ల కూడా గుడ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
కాబట్టి గుడ్లు ఎక్కువ మొత్తంలో కొన్నప్పుడు ఇటువంటి చిట్కాలను పాటించడం వల్ల గుడ్లు చెడిపోకుండా (without spoiling) ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…