Telugu Mirror News Zone

Election Holidays: వాళ్ళకు మాత్రమే మే 14వ తేదీ సెలవు, ఎందుకంటే?

Election Holidays

Election Holidays: తెలంగాణలో ఈ నెల 13వ తేది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 13వ తేది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి మరుసటి రోజు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 13వ తేది ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి 14వ తేది స్పెషల్ క్యాజువల్ లీవ్ లేదా, పెయిడ్ హాలిడే (Paid Holiday) గా గుర్తించాలని సీఈఓ వికాస్‌రాజ్ (CEO Vikas Raj) అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశించారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మే 13 (May13) వ తేదీని సెలవు దినంగా ప్రకటించింది. 13న లోక్‌సభ ఎన్నికలు, కంటోన్మెంట్‌ ఉపఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ తేదీని సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఓట్ల లెక్కింపు రోజైన జూన్ 4న పరిపాలన సెలవు పెట్టింది. మే 13, జూన్ 4 తేదీలను వేతనంతో కూడిన సెలవులుగా ప్రకటించారు.

Election Holidays

ప్రభుత్వ వేతనంతో కూడిన సెలవు విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Shanthi Kumari) జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఎన్నికల అధికారులు సెలవులు ఇచ్చారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు  (Telangana Loksabha Elections) మే 13, 2024న ఒకే దశలో జరుగుతాయి. మొత్తం ఏడు దశల ఓట్లను జూన్ 4న లెక్కించనున్నారు.

రాష్ట్రంలో వేడిగాలుల కారణంగా 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక గంట పొడిగించారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో భాగమైన కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లు మే 13న రెండుసార్లు ఓటు వేయనున్నారు.ముందుగా ఎంపీ ఓటు వేయాలి, తర్వాత ఎమ్మెల్యే ఓటు వేయాలి. ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఎన్నికల కోసం 3,986 ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 23,500 మంది ఉద్యోగులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఓటు ఉన్న వారు వచ్చి ఓటు వేయాలి అని ఎన్నికల కమిషన్ (Election Comission) తెలిపింది.