Face Pack : 20 ఏళ్ళకే 40 లా కనిపిస్తున్నారా? అందుకు కారణమైన ముడతలను ఇలా తగ్గించి మరలా 20 కి వచ్చేయండి
కొంతమంది తక్కువ వయస్సు ఉన్నా, పెద్ద వయసు ఉన్న వారిలా కనిపిస్తూ ఉంటారు. చిన్న వయసులోనే ముఖంపై ఉన్న ముడతలను మరియు మచ్చలను తొలగించుకోవడానికి ఇంట్లో తయారు చేసిన కొన్ని ఫేస్ ప్యాక్ ల గురించి తెలుసుకుందాం.
కొంతమంది తక్కువ వయస్సు ఉన్నా, పెద్ద వయసు (old age) ఉన్న వారిలా కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా కనిపించడం వలన ఎంతో బాధపడుతుంటారు. వీళ్ళు మార్కెట్లో లభించే కొన్ని రకాల ఫేస్ క్రీమ్స్ మరియు ఫేషియల్స్ లాంటివి ఉపయోగిస్తుంటారు.
చర్మంపై ఉన్న ముడతలను తగ్గించి ముఖాన్ని యంగ్ గా ఉంచడంలో సహాయపడే కొన్ని ఫేస్ ప్యాక్ లు ఉన్నాయి. చిన్న వయసులోనే ముఖంపై ఉన్న ముడతలను మరియు మచ్చలను తొలగించుకోవడానికి ఇంట్లో తయారు చేసిన కొన్ని ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం వలన ముఖంపై వచ్చిన ముడత లను (Wrinkles) మరియు మచ్చలను సులభంగా పోగొట్టుకోవచ్చు.
ఈరోజు కథనంలో చర్మంపై ఉన్న ముడతలను మరియు మచ్చలను తొలగించుకునే ఫేస్ ప్యాక్ ల గురించి తెలుసుకుందాం.
అశ్వగంధ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. రెండు టీ స్పూన్ల అశ్వగంధ పొడి (Ashwa gandha powder) లో ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, గుడ్డులోని తెల్లసొన, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలిపి పేస్టులా తయారు చేయాలి. దీనిని ముఖం మరియు మెడపై అప్లై చేయాలి. ఆరిన తర్వాత సాధారణ నీటితో కడగాలి.
Also Read : Natural Face Pack : మచ్చలు పోయి సహజత్వం ఉట్టిపడాలంటే.. ఈ నాచురల్ ఫేస్ ప్యాక్ ట్రై చేయాల్సిందే ..
ఈ ప్యాక్ ను వాడటం వల్ల ముఖం (Face) పై ఉన్న ముడతలు మరియు ఫైన్ లైన్స్ ను సులభంగా పోగొట్టుకోవచ్చు అని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ ప్యాక్ లో ఎగ్ వైట్ ను ఉపయోగించాం.ఇది చర్మం పై ఉన్న ముడతలను నిర్మూలించడంలోను మరియు సాగిపోయిన (stretched) చర్మాన్ని బిగుతుగా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా నిమ్మరసం చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
అవకాడో (Avocado) ను పేస్ట్ చేయాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ తేనే కలపాలి. ఈ ప్యాక్ ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మం ను మృదువుగా చేయడంలో చాలా బాగా సహాయపడతాయి.
Also Read : Fenugreek Seeds Benefits : మెంతుల ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. వాడండి తేడా చూడండి
అంతేకాకుండా అవకాడో లో ఉండే రిచ్ యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వలన ఈ ప్యాక్ చర్మానికి (Skin) అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది.
రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పొడి (Oatmeal powder) లో, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్ట్ ను ముఖంపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఓట్స్ చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడతాయి. అలాగే పెరుగులో లాక్టిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో తోడ్పడుతుంది.
Also Read : Fruit Peels Face Pack : ‘తొక్క’ లే అని విసిరివేయకండి – చేసే మేలు తెలిస్తే షాకవుతారండి
బాగా పండిన అరటి పండు (Banana) లో, తేనె కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ని ముఖం మరియు మెడ పై అప్లై చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో (Hot Water) ముఖాన్ని శుభ్రంగా కడగాలి. అరటి పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు చర్మానికి పోషణ ను అందించి చర్మం ను హైడ్రేట్ గా ఉంచుతుంది.
కాబట్టి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు మరియు మచ్చలు (Spots) ఉన్నవారు ఈ ప్యాక్ లను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యల నుండి సులువుగా బయటపడవచ్చు.
Comments are closed.