హోండా షైన్-100 2025 వేరియంట్‌ను కంపెనీ లాంచ్ చేసింది.
స్కూటర్ ఇండియా లిమిటెడ్ 2025 హెూండా షైన్ 100 బైక్‌ను రూ.68,767 (ఎక్స్-
ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బైక్స్ వినియోగం పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఇంటికి వారి అవసరాలను తీర్చుకోవడానికి బయటకు వెళ్లేలా ఓ బైక్ ఉంటుంది. భారతదేశ జనాభాలో అధిక శాతం మధ్యతరగతి ప్రజలు ఉంటారు. అందువల్ల తక్కువ నిర్వహణ ఖర్చు అయ్యే బడ్జెట్ బైక్స్ కొనుగోలుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ బైక్‌గా ప్రసిద్ధి చెందిన హోండా షైన్-100 2025 వేరియంట్‌ను కంపెనీ లాంచ్ చేసింది.
హెూండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ 2025 హెూండా షైన్ 100 బైక్‌ను రూ.68,767 (ఎక్స్- షోరూమ్) ధరతో భారతదేశంలో విడుదల చేసింది, ఈ బైక్ డిజైన్‌తో మెకానికల్ అప్‌డేట్స్‌తో కంపెనీ లాంచ్ చేసింది. కొత్త హెూండా షైన్-100 పాత మోడల్ కంటే రూ.1,867 ధర ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 2025 హెూండా షైన్ 100 కొత్త కలర్ ఆప్షన్లు, కొత్త బాడీ గ్రాఫిక్స్, అప్ గ్రేడ్ చేసిన ఇంజిన్‌తో పాటు ఇతర అప్‌డేట్స్‌తో ఆకట్టుకుంటుంది. డిజైన్ విషయానికి వస్తే 2025 హెూండా షైన్-100 కొత్త బ్లాక్ విత్ ఆరెంజ్ కలర్ స్కీమ్‌తో పాటు బ్లాక్ విత్ గోల్డ్ కలర్ స్కీమ్‌లో ఆకర్షిస్తుంది. అలాగే బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ బ్లూ, బ్లాక్ విత్ గ్రే, బ్లాక్ విత్ గ్రీన్ వంటి కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలుదారులకు ఈ బైక్ అందుబాటులో ఉంది.