Amazing Pushpa 2 Teaser : ఇది పుష్ప గాడి మాస్ జాతర.. పూనకాలు తెప్పిస్తున్న పుష్ప 2 టీజర్..!

Amazing Pushpa 2 Teaser

Amazing Pushpa 2 Teaser : ప్రస్తుతం మోస్ట్ యాంటిసిపేట్ మూవీ (Most anticipated Movie) పుష్ప 2 (Pushpa 2). గతంలో సంచలనం సృష్టించిన పుష్పకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ సెన్సేషన్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న, సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా పుష్ప 2 (Pushpa 2) టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పుష్ప ది రూల్ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఆకట్టుకునేలా ఉంది. ఇంకా టీజర్ పూర్తి విశేషాల్లోకి వెళితే..

పుష్ప 2 టీజర్‌లో (Pushpa 2 Teaser) అమ్మవారి గెటప్‌లో మాస్ అవతారంతో అల్లు అర్జున్ కనిపించాడు. ఏదో ఒక జాతరతో రౌడీలతో ఫైట్ సీన్‌కు సంబంధించిన సీన్స్ చూపించారు. ఇందులో బన్నీ నడిచే స్టైల్, స్వాగ్ అదిరిపోయాయి. కాళ్లకు గజ్జెలు, ఇయర్ రింగ్స్, కళ్లకు కాటుకతో అల్లు అర్జున్ లుక్ మైండ్ బ్లోయింగ్‌లా ఉంది. ఫైట్ సీక్వెన్స్ కూడా స్టన్నింగ్‌గా ఉంది. ఇక ఈ సీన్స్‌కు దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (Background score) నెక్ట్స్ లెవెల్ అనేలా ఉంది. అల్లు అర్జున్ బర్త్ డేకు అభిమానులకు పర్ఫెక్ట్ గిఫ్ట్‌లా ఉంది పుష్ప 2 టీజర్.

జాతీయ స్థాయి అవార్డ్
ఇదిలా ఉంటే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా లెక్కల మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయ స్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప-2 ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి.

ఆగస్టు 15న రిలీజ్
పుష్ప 2 సినిమాను 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తోపాటు రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు.

Amazing Pushpa 2 Teaser

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in