Karthikeya 3 : బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబో రిపీట్..కార్తికేయ 3 పై బిగ్ అప్డేట్..

Blockbuster Combo Repeat..Big Update on Karthikeya 3..

Telugu Mirror : యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ – దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన కార్తికేయ, కార్తికేయ 2 చిత్రాలు బాక్సాఫీస్ (Box Office) వద్ద విజయాలు సాధించాయి. అవి పౌరాణిక కథాంశాలతో మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చి చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్తికేయ చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’ గ్రామం మిస్టరీ కథ ఆధారంగా రూపొంది బ్లాక్ బస్టర్ (Block Buster) అయ్యింది మరియు 2022 లో విడుదలైన కార్తికేయ 2 భారతదేశం అంతటా బ్లాక్ బస్టర్ అయ్యింది. తెలుగు, హిందీ భాషల్లో భారీ వసూళ్లను రాబట్టింది. శ్రీకృష్ణుడి ఆధారంగా తెరకెక్కిన కార్తికేయ 2, మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్ గా భారీ విజయాన్ని సాధించింది.

Also Read : muthoot microfin New Branches 2024: మహిళలకు గుడ్ న్యూస్, ఏకంగా రూ.3 లక్షలు రుణాలు

కార్తికేయ 2 చిత్రం క్లైమాక్స్లో (Climax) కార్తికేయ 3 (Karthikeya 3) చిత్రం ఉంటుందని దర్శకుడు చందు మొండేటి తెలిపాడు. అయితే ఆ తర్వాత ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ లు ఏమీ లేవు. దీంతో కార్తికేయ 3 అప్డేట్ కోసం ప్రేక్షకులు చాల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈరోజు(మార్చి 17) సినిమా గురించి హీరో నిఖిల్ ఓ అప్‌డేట్ అందించాడు. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.

హీరో నిఖిల్ తన x (Twitter) ఇలా రాసుకొచ్చాడు “డాక్టర్ కార్తికేయ త్వరలో కొత్త సాహసం కోసం చూస్తున్నారని” నిఖిల్ ఈరోజు ట్వీట్ చేశాడు. దీంతోపాటు సినిమా స్టిల్స్‌కు సంబంధించిన రెండో ఫోటోను పోస్ట్ చేశారు. కార్తికేయ 3 హ్యాష్‌ట్యాగ్‌ని జోడించి చందూ మొండేటిని ట్యాగ్ చేశారు.

ప్రస్తుతం, చందు మొండేటి కార్తికేయ 3 కోసం స్క్రిప్ట్‌పై (Script) పని చేస్తున్నాడని తెలుస్తోంది. మొదటి రెండు పార్ట్స్ బ్లాక్ బస్టర్ అయిన తరుణం లో చిత్ర నిర్మాతలు మూడవ భాగాన్ని చాల భారీగా నిర్మిస్తున్నారు. పాన్-ఇండియా రేంజ్‌లో కార్తికేయ 3 భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. చందు మొండేటి ఇప్పుడు నాగ చైతన్య హీరోగా తాండల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే కార్తికేయ 3 ను స్టార్ట్ చేస్తారని సమాచారం.

నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నాడు…

నిఖిల్ ఇప్పుడు స్వయంభూ (Swayambhu) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం చక్రవర్తుల పాలనపై పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ గతేడాది ప్రారంభమైంది. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తోంది. స్వయంభూ చిత్రం పాన్ ఇండియా మూవీ గ కూడా విడుదల కానుంది. దీనిని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయాలనీ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.

Also Read : Virat Kohli : ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ..!

నిఖిల్ ఈ మధ్యనే తండ్రి అయ్యాడు..

హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ మధ్య తల్లితండ్రులయ్యారు. నిఖిల్ భార్య పల్లవి గత నెలలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ జంట మొదటిసారి తల్లిదండ్రులు అయ్యారు. నిఖిల్ మరియు పల్లవి మే 2020లో ప్రేమ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత నిఖిల్, పల్లవి తల్లిదండ్రులు అయ్యారు. ఇటీవలే తమ కుమారుడి కోసం బారసాల వేడుకను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in