Telugu Mirror : టాలీవుడ్‌లో సినిమా, సినిమాకు వైవిధ్యం చూపిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈయన ’జాంబీ రెడ్డి’ (Zombie Reddy) తర్వాత ‘హనుమాన్’ (Hanuman) సినిమాతో వచ్చారు. ఈ సినిమా జనవరి 12న విడుదలై బంపర్ హిట్ అయ్యింది. ఇటు తెలుగుతో పాటు హిందీలో అదరగొట్టింది. హనుమాన్ సినిమా అవ్వడానికి మిడ్ రేంజ్ సినిమా అయినా బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, అల వైకుంఠపురములో వంటి భారీ సినిమాల రికార్డ్స్‌ను బద్దలు కొట్టింది.
ఇప్పుడు అందరూ హనుమాన్ OTT స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. OTT ప్లాట్‌ఫారమ్ Zee5 నుండి అధికారిక అప్‌డేట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రం మార్చి 8న అందుబాటులోకి వస్తుందని భావించారు, అయితే ఇది ప్రస్తుతం స్ట్రీమింగ్ కావడం లేదు అలాగే zee 5 నుంచి అధికారిక అప్‌డేట్ లేదు. అయితే ఈ సినిమా మార్చి 08న స్ట్రీమింగ్‌కు రాకుండా షాక్ ఇచ్చింది.
Also Read : iQoo Z9 5G: ఐక్యూ నుంచి మరో ఇంట్రెస్టింగ్ స్మార్ట్‌ఫోన్.. ఇంత తక్కువ ధరలో ఎలా బాసు..?
కాగా మరో ట్విస్ట్ ఏంటంటే ఓటీటీలో కన్నా ముందే ఈ ‘హనుమాన్’ (HanuMan) మూవీ టీవీలో ప్రసారం అవ్వడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను కలర్స్ సినీ ఫ్లెక్స్ దక్కించుకుంది. అందులో భాగంగా మార్చి 16న రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ (Colors Cineplex) ఛానల్‌తో పాటు, జియో సినిమా (Jio Cinema)లో టెలికాస్ట్ కానుంది. అయితే అది కేవలం హిందీలో మాత్రమే. ఈ సినిమా రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, రూ.330 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి వావ్ అనిపించింది.
అయితే హిందీ వెర్షన్ OTT స్ట్రీమింగ్ మరియు ప్రసార ప్రారంభ తేదీలు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అధికారికంగా ప్రకటించాడు. జియో సినిమాలో OTT స్ట్రీమింగ్ మరియు కలర్స్ సినీప్లెక్స్ ((Colors Cineplex) )టెలివిజన్ లో ప్రసారం కానుంది. అదే రోజు అంటే మార్చి 16న Zee 5న అన్ని భాషల్లో హనుమాన్ ప్రసారం కావొచ్చు అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు . క్రియేటర్లు మరియు ప్లాట్‌ఫారమ్‌లు అదే రోజున చిత్రాన్ని విడుదల చేయడానికి ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.
Also Read : Gold Rates Today 09-03-2024: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు, తులం పుత్తడి ధర ఎంతంటే?
హనుమాన్ థియేటర్‌లో రికార్డ్స్ బద్దలు కొట్టాడు అలాగే OTT ప్లాట్‌ఫారమ్‌లు మరియు టెలివిజన్‌లో కూడా చాలా సంచలనం సృష్టిస్తుందని అందరు భావిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జ, అమృత అయ్యర్ మరియు వరలక్ష్మి శరత్‌కుమార్ నటించారు. వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా నటించాడు.