అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న “సాలార్ ” సినిమా ట్రీజర్ విడుదల డేట్ ఎప్పుడో తెలుసా?

హ్యాండ్ సమ్ హీరో ప్రభాస్ మరో సినిమాతో తొందరలోనే వస్తున్నాడు. 'ఆదిపురుష్' సినిమా మధ్యస్తరంగా ఉండడం బాధాకర విషయం. అయినప్పటికీ ఇప్పుడు అందరి చూపు సాలార్ సినిమా పై ఉంది. ట్రీజర్ విడుదల డేట్ వచ్చేసింది.

Telugu Mirror: రెబల్ స్టార్ “ప్రభాస్” (Prabhas) ఆదిపురుష్ (Adipurush) సినిమా తర్వాత “సాలార్ ” సినిమా (salaar movie) షూట్ లో బిజీ అయ్యాడు. తన కట్ అవుట్ మరియు హైట్ తో అమ్మాయిల మనసులో స్థానం సంపాదించి , తన మంచి మనసుతో అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. ఇటీవలే విడుదలయిన “ఆదిపురుష్” సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. పరాజయం తో ఈ సినిమా నిరాశని మిగిల్చింది. అయితే ఇప్పుడు తాజాగా వార్తలలో, ‘సాలార్’ సినిమా షూట్ లో బిజీ గా ఉన్నట్టు ఈ సినిమా టీజర్ సెప్టెంబర్ 6 న ప్రారంభం కానుంది. అయితే ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

‘ఆదిపురుష్’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఇదే. “ఆదిపురుష్” చాలా మందిని నిరాశపరచినప్పటికీ “సాలార్” 2023లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి.

సినిమా ప్రీమియర్‌కి కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ట్రైలర్‌ను చూడటానికి అభిమానులు వేచి ఉండలేకపోతున్నారు. ‘సాలార్‌’ టీజర్‌కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. SRK నటించిన “సాలార్” మరియు “జవాన్” సినిమా మధ్య సంబంధం ఉండవచ్చు కానీ దీని గురించి అధికారిక ధృవీకరణ లేదు.

image credit: English Jagran, salar movie trailer going to release on september 6th 2023
image credit: English Jagran, salar movie trailer going to release on september 6th 2023

Also Read:Gowtham Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ అడుగుజాడల్లో ప్రిన్స్ మహేష్ , నా మార్గం కూడా అదే అంటున్న తనయుడు గౌతమ్.

“సాలార్” మూవీ డ్రామా యాక్షన్‌తో కూడి ఉంటుంది. ఈ సినిమా కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తున్న అభిమానులకు సెప్టెంబరు 28న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ (prudhviraj), సుకుమారన్ (sukumaran), శృతిహాసన్(sruthihasan), జగపతి బాబు(jagapathi babu) కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 28న సినిమా మొదటి భాగం థియేటర్లలో విడుదల కానుంది. దీనికి పెట్టిన పేరు ‘సాలార్: పార్ట్ 1 – Ceasefire.’

ఈ సినిమా సీక్వెల్‌కి సంబంధించి మరింత సమాచారం ఇంకా వెల్లడించాల్సి ఉంది. ‘సాలార్‌’ చిత్రానికి హోంబలే ఫిల్మ్స్‌ (Hombale Films)నిర్మాణ సంస్థ మరియు KGF 1 మరియు KGF 2 చిత్రాల సిరీస్‌లకు అత్యంత గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం “సాలార్” సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పై అందరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.