Telugu mirror : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సాలార్ (Salaar) సినిమా మంచి హిట్ ని సాధించి పెట్టింది. ఈ మధ్య కాలంలో ప్రభాస్ నటించిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు మరియు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. డిసెంబర్ 22 , 2023 న విడుదలయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి మన అందరికి తెలిసిందే. రిలీజ్ అయి 24 రోజులు కాగా.. సాలార్ సినిమా ఇప్పుడు ఓటిటీ లో సందడి చేయడానికి సిద్ధం అవుతుంది.
నెట్ఫ్లిక్ సాలార్ మూవీని రూ.100 కోట్లతో దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పండుగ సందర్బంగా నెట్ఫ్లిక్ నుండి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. మరి ఇంతకీ సాలార్ సినిమా నెట్ఫ్లిక్ లో ఎప్పుడు రిలీజ్ కానుంది? సాలార్ మూవీ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
The people of Khansaar can begin their celebrations. Their Salaar has returned to his kingdom.👑#Salaar is coming soon on Netflix in Telugu, Tamil, Malayalam and Kannada as a post theatrical release! #NetflixPandaga pic.twitter.com/iSuNbKHjNv
— Netflix India South (@Netflix_INSouth) January 15, 2024
సంక్రాంతి పండుగ సందర్బంగా మరో కొన్ని సినిమాలు రిలీజ్ కావడంతో సాలార్ మూవీ తొందరలోనే ఓటిటీ లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంస్టాగ్రామ్ పేజీ ద్వారా సాలార్ మూవీ తొందర్లోనే విడుదల చేస్తామని నెట్ఫ్లిక్ వెల్లడించింది. సాలార్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన 45 రోజుల తర్వాత నెట్ఫ్లిక్ లో స్ట్రీమింగ్ చేయవచ్చని ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో వారంలో విడుదల కానుంది. అగ్రిమెంట్ ప్రకారం చూస్తే ఫిబ్రవరి 4న స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తుంది.
View this post on Instagram
సాలార్ మూవీ ఓటీటీ హక్కులు :
పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన మూవీ సాలార్. నెట్ఫ్లిక్ 5 భాషల ఓటిటీ హక్కులను దక్కించుకుంది. రూ.270 కోట్లతో తీసిన ఈ సినిమాకి నెట్ఫ్లిక్ ఫ్లాట్ ఫారం రూ.162 కోట్లు చెల్లించింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో మరియు ఓటిటి ఫ్లాట్ ఫారం ద్వారా మరి కొన్ని చెల్లించడం తో మేకర్స్ పై కాసుల వర్షం కురుస్తుంది.
సాలార్ మూవీ పార్ట్ 2 టైటిల్ పేరు సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం. సెకండ్ పార్ట్ ని 2025 లో రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. పార్ట్ 2 కి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ ఉండడం తో షూటింగ్ ఎప్పుడు అయినా మొదలు పెట్టొచ్చని సినిమా నిర్మాత విజయ్ కిరాగండూర్ తెలిపారు. ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898 ఏడి రిలీజ్ డేట్ చెప్పగా, మరో సినిమా ది రాజా సాబ్ అనే సినిమాకి టైటిల్ ఇచ్చి ఫస్ట్ లుక్ ని చూపించడం కూడా జరిగింది.