Telugu Mirror : తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా పేరొందిన వారిలో మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) ఒకరు. ఆచార్య , భోళా శంకర్ మూవీలు ప్లాప్ అయ్యాయని మనకి తెలుసు. అయితే చిరు ఖాతాలో మరో కొత్త చిత్రం షురూ అయింది. ఈ చిత్రానికి యంగ్ అండ్ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ అయిన వశిష్ట (Mallidi Vassishta) దర్శకత్వం వహించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రాబోయే చిత్రం మెగా156 ఫాంటసీ థ్రిల్లర్‌గా ఉండనుంది, పండగ రోజున చిరంజీవి మరియు సురేఖ దంపతులు పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక నిర్మాతలు స్క్రిప్ట్ ని వారికి అందజేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ సినిమాలు తీస్తున్న యూవీ క్రియేషన్స్ (UV Creations) ఇప్పుడు తాజాగా చిరు- వశిష్ఠల కాంబినేషన్ లో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రమోద్ , వంశీ మరియు విక్రమ్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. యూవీ క్రియేషన్స్ 14వ ప్రొడక్షన్ తో చిరు 156వ సినిమాని ప్రారంభించారు.
ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ఏంటంటే, దీని నిర్మాణం 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో మన ముందుకు వస్తుంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి గారు సంగీత దర్శకత్వాన్ని వహిస్తూ ఇలా మాట్లాడారు. ఇది చిరంజీవి 156వ సినిమా. ఈ సినిమా లో 6 పాటలు ఉంటాయని చెప్పారు . మ్యూజిక్ రికార్డు తో పూజ కార్యక్రమాలు మొదలయ్యాయని మరియు డైరెక్టర్ వశిష్ఠకి ‘అల్ ది బెస్ట్’ తెలియపరిచారు.
గీత రచయిత అయిన చంద్రబోస్ మాట్లాడుతూ అందరికి దసరా శుభాకాంక్షలు తెలిపి ఈ సినిమాకి మంచి పాటలు అందిస్తామని చెప్పుకొచ్చారు. చిరు సినిమాలల్లో ఇదే ఎక్కువ బడ్జెట్ తో తీస్తున్న మూవీ అని మేకర్స్ తెలియజేసారు. ఈ సినిమాకు సాయిమాధవ్ మాటలు అందిస్తున్నారు. చోట కే. నాయుడు సినిమాటోగ్రఫీ, సుష్మిత కొణెదల కాంస్టూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చిత్రం అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన సాంకేతికతను కలిగి ఉంటుంది. ఈ చిత్రాన్ని విజువల్ సీన్ గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది, అందుకే ఈ ప్రాజెక్ట్‌పై నిర్మాతలు అధిక స్థాయిలో డబ్బు ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు. చిత్ర నిర్మాత అందుబాటులో ఉన్న సోర్సెస్ ని సమర్ధవంతంగా ఉపయోగించుకోగలిగితే, ఈ చిత్రం చిరు యొక్క అద్భుతమైన కెరీర్ లో ఒక మైలురాయిగా మారే అవకాశం ఉంది.