పవర్ స్టార్ పుట్టినరోజు సందర్బంగా 470 కేజీల వెండితో ముఖ చిత్రం, అందరినీ అబ్బురపరిచిన పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వస్తుంది అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆశ్చరకరమైన విషయం గురించి వింటూనే ఉంటాం. అయితే ఈసారి అభిమానులు ఒక అద్భుతమైన చిత్ర పటాన్ని వెండితో రూపొందించారు. ఆ వీడియో ని ఇప్పుడే వీక్షించండి.

Telugu Mirror : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవర్ స్టార్ (Power Star) గా అభిమానులు పిలుచుకునే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ఇతర హీరోల అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు స్పష్టమైన తేడా వుంటుంది. అయితే పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్ అభిమానులా మజాకా అన్న తీరుగా వారు తెలిపిన పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఒక రకంగా చెప్పాలంటే పవన్ పై వాళ్ళకు ఉన్నది అభిమానం అనేకంటే భక్తి అనడంలో అతిశయోక్తి లేదు. ఇండస్ట్రీలోనే కాదు ఇండస్ట్రీ(Industry) బయట కూడా ఈ మాటను అంగీకరిస్తారు. అభిమానంతో వాళ్ళు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై చూపించే ప్రేమకి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతుంటారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ఆయన అభిమానులు చేసిన పని చూసిన ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ రూపాన్ని సుమారు 470 కేజీల వెండితో రూపొందించి కేక పుట్టించారు.

ఈ రోజు (సెప్టెంబర్ 2) పవన్ పుట్టినరోజు అన్న విషయం విదితమే. తమ అభిమాన హీరో పుట్టిన రోజున ఒక అరుదైన బహుమతి ఇవ్వాలనే భావనతో కొంతమంది అభిమానులు 470 కేజీల వెండి ఆభరణాలతో.. నేల మీద పవన్ కళ్యాణ్ రూపాన్ని రూపొందించి దానిలో అమర్చి కిర్రాక్ అనిపించారు. ఇలా పవన్ రూపాన్ని అమర్చే సమయాన్ని వీడియోగా చిత్రీకరించి దానిని జనసేన పార్టీ (Janasena Party) నాయకుడు నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ద్వారా విడుదల చేయించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

ఈ వీడియోని చూసిన వారంతా పవన్ రూపాన్ని అమర్చడానికి వాడిన వెండి ధర ఎంత ఉంటుంది అనేదానిపై చర్చిస్తున్నారు.ప్రస్తుతం విపణి లో ఉన్న సిల్వర్ రేటు ప్రకారం ఆ 470 కేజీల వెండి ధర దాదాపు 3 కోట్ల 71లక్షల 30వేలు (రూ3,71,30,000) అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈరోజు పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల నుంచి పవన్ కు ఇంకా ఏ విధమైన బహుమతులు వస్తాయో వేచి చూడాలి. కాగా పవన్ కళ్యాణ్ అభిమానులకు గిఫ్ట్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా ప్లాన్ చేశారు.

OG మూవీ టీజర్ ని ఈరోజు ఉదయం 10:35 నిమిషాలకు విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు బహుమతిగా ఇచ్చిన OG చిత్రంలోని మొదటి టీజర్ (Teaser) అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది.

Leave A Reply

Your email address will not be published.