Thalaivar 170 : సూపర్‌స్టార్ రజనీకాంత్ “తలైవర్ 170” షూటింగ్‌ అప్‌డేట్, ఈరోజే ప్రారంభమైన నయా షెడ్యూల్.

చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో వేసిన సెట్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, జనవరి 24 నాటికి పూర్తి చేయాలని మూవీ టీమ్ భావిస్తున్నారు.

Telugu Mirror : తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) తలైవర్ 170 (Thalaivar 170) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జై భీమ్ (Jai Bheem) సినిమాతో పేరు తెచ్చుకున్న టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఎక్కువ భాగం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Produuctions) పేరుతో సుభాస్కరన్‌ దీన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల, తలైవర్ 170 చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ సెట్ నుండి రజనీకాంత్ మరియు అమితాబ్ బచ్చన్‌ల స్టిల్‌ను పంచుకున్నారు.

Also Read : JIO CLOUD PC : రిలయన్స్‌ జియో మరో శుభవార్త కేవలం రూ. 15 వేలకే ల్యాప్‌టాప్‌

ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన చిత్రీకరణ అక్టోబర్‌లో ప్రారంభమైంది. మొదటి ప్రణాళిక ఇప్పటికే పూర్తి చేయబడింది. అత్యంత తాజా సమాచారం ప్రకారం తలైవర్ 170 యొక్క కొత్త షెడ్యూల్ ఈరోజు ప్రారంభమైంది. చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌ (Prasad Lab) లో చిత్రీకరణ ప్రారంభమైన తర్వాత ఈ షెడ్యూల్ మరో వారం పాటు కొనసాగుతుందని సినీ వర్గంలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత తలైవర్ 170 చిత్రీకరణ బయట లొకేషన్లలో కొనసాగించనున్నారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

Thalaivar 170 : Superstar Rajinikanth "Thalaivar 170" shooting update, new schedule started today.
image credit : The Times Of India

గురు చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రితికా సింగ్ (Rithika Singh) ఈ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజువారియర్ మరియు దుషార విజయన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు. తలైవా 170 (Thalaivar 170) సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీతో లైకా ప్రొడక్షన్స్ సంస్థకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. వాళ్ళ కలయికలో వచ్చిన మొదటి సినిమా ‘2.0’ రికార్డులు క్రియేట్ చేసింది. ‘దర్బార్’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, అందులో రజనీకాంత్ లుక్కు, యాక్షన్ సన్నివేశాలకు మంచి పేరు వచ్చింది. ‘లాల్ సలాం’ (Lal Salaam) ను కూడా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చూస్తుంటే లైకా ప్రొడక్షన్స్ సంస్థ రజనీతో మరిన్ని సినిమాలు చేసేలా ఉన్నారు.

Also Read : Small Savings Schemes (SSY) : పిల్లల భవిష్యత్ అవసరాలకు సుకన్య సమృద్ది యోజన, ఖాతా తెరవాలంటే కావలసిన పత్రాలు ఇవిగో

జైభీమ్‌ లాంటి సామాజిక సందేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన జ్ఞానవేళ్‌ సిల్వర్ స్క్రీన్‌పై తలైవాను ఎలా చూపించబోతున్నాడని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. రజినీకాంత్‌ మరోవైపు కూతురు ఐశ్వర్య రజినీకాంత్‌ దర్శకత్వంలో లాల్‌సలామ్‌లో కూడా నటిస్తుండగా ఆ చిత్రం షూటింగ్‌ కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీ సంక్రాంతి 2024 కానుకగా విడుదల కానుంది. రజినీకాంత్‌ దీంతోపాటు స్టార్ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తలైవా 171 కు కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు.

Comments are closed.