Telugu mirror : ఆస్ట్రేలియా లో చేపల వేటకు వెళ్ళి అదృశ్య మైన మత్స్యకారుడి మృతదేహం మొసలి కడుపులో గుర్తించారు.మత్స్య కారుడి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్య చివరకు విషాదంతో ముగిసినట్లు పోలీసులు తెలిపారు.ఆస్ట్రేలియా లోని ఉత్తర క్వీన్స్ ల్యాండ్ లో మొసళ్ళకు ఆవాస ప్రాంతమైన కెన్నడీస్ బెండ్ వద్ద కెవిన్ డార్మొడి అనే పేరుగల చేపల వేటగాడు చివరిసారిగా కనిపించాడు.అదృశ్యమైన డార్మొడి కోసం రెండు రోజులు వెతుకులాడిన పోలీసులు, మత్స్యకారుడు అదృశ్యమైన ప్రాంతంలో రెండు భారీ మొసళ్ళను చంపినారు.చంపిన మొసళ్ళను పరిశీలించగా మనిషి శరీర భాగాలు కనిపించాయి.
Telugu Mirror Panchagam: 04 జూలై 2023 మంగళవారం పంచాంగం
ఈ శరీర భాగాలు కనిపించకుండా పోయిన చేపల వేటగాడిదిగా గుర్తించారు. చేపల వేటలో బాగా అనుభవమున్న డార్మొడి, కేప్ యార్క్ ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ సుపరిచితుడు.మత్స్య కారుడైన డార్మొడి కనపడకుండా పోయిన క్వీన్ ల్యాండ్స్ లోని కెన్నడీస్ బెండ్ వద్ద సుమారు 4.1మీటర్లు (13.4 అడుగులు),2.8 మీటర్ల(సుమారు 9.2 అడుగులు) పొడవైన రెండు భారీ మొసళ్ళను సోమవారం అక్కడి అటవీ అధికారులు కాల్చి చంపారు. కాల్చి చంపిన వాటిలోని ఒక మొసలి కడుపులో మానవ శరీర భాగాలు ఉన్నాయని అయితే,ఈ రెండు మొసళ్ళు కలిసే అతన్ని చంపి ఉంటాయని అటవీ అధికారులు తెలిపారు.
ఇదిలావుండగా కేప్ యార్క్ వీక్లీ మీడియా సంస్థతో డార్మొడితో పాటు చేపల వేటకు వెళ్ళిన అతని స్నేహితుడు జాన్ పీటి మాట్లాడుతూ మొసళ్ళు దాడి చేయడం చూడలేదు అని అయితే గట్టిగా అరుపులు వినిపించాయని చెప్పారు.అరుపులు విని నేను అక్కడకు పరిగెత్తాను కానీ అక్కడ డార్మొడి కనిపించలేదు.అతని దుస్తులు మాత్రం ఒడ్డున కనిపించాయని కేప్ యార్క్ మీడియా సంస్థకు జాన్ పీటి చెప్పారు.మొసలి నీటిలోంచి బయటకు వచ్చి డార్మొడిని లోపలికి లాక్కెళ్ళడానికి అవకాశం లేదని,డార్మొడి అరుపులు విన్నానని, అతను మూడు సార్లు బిగ్గరగా కేకలు వేసినట్లు వినిపించి ఏం జరిగిందో చూసేందుకు అక్కడికి వెళ్ళాను అని డార్మొడి స్నేహితుడు జాన్ పీటి తెలిపాడు.
Building Railway Track in China: చైనా లో అద్భుతం.బిల్డింగ్ మధ్య రైల్వే ట్రాక్..ఎలా సాధ్యం?
కేకలు వేసిన మరు నిమిషంలో నీళ్ళలో అలికిడి వినిపించి వెంటనే అక్కడికి పరిగెత్తాను. ఆ పరిసర ప్రాంతంలో చూస్తే అతను ఎక్కడా కనిపించలేదు కానీ అతని దుస్తులు మాత్రం ఒడ్డున కనిపించాయి.అని జాన్ తెలిపినట్లు కేప్ యార్క్ వీక్లీ తెలిపింది. మొసళ్ళను చూసి డార్మొడి అరిచి ఉంటాడని, వాటిని చూసిన కంగారులో అదుపుతప్పి నీళ్ళలో పడిపోయి ఉంటాడని జాన్ తెలిపాడు.అలాగే జరిగి ఉండొచ్చని తాను అనుకుంటున్నట్లు ఆయన చెప్పాడు.
ఆస్ట్రేలియా ఉత్తర ప్రాంతంలో మొసళ్ళు ఉండడం అత్యంత సహజమైన విషయమే అయినా మనుషుల పై దాడి చేయడం బహు అరుదుగా చెపుతున్నారు. మత్స్యకారుడి పై జరిగిన మొసళ్ళ దాడి,1985 సంవత్సరం తర్వాత క్వీన్స్ ల్యాండ్ లో జరిగిన 13వ దారుణ ఘటన గా పేర్కొంటున్నారు.