Flight Journey : విమాన ప్రయాణం ఇప్పుడు ఉచితంగా, ఈ క్రెడిట్ కార్డ్స్ ఉంటే సరిపోతుంది.
మీరు క్రెడిట్ కార్డ్స్ వినియోగిస్తే.. మీకు ఒక గుడ్ న్యూస్. ఉచితంగానే విమాన ప్రయాణం చేయవచ్చు. ఎలానో ఇప్పుడు చూద్దాం.
Flight Journey : విమానం ఎక్కాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఉచితంగా విమానం ఎక్కే అవకాశం ఉంటే ఎవరు మాత్రం వదులుకుంటారు. ఒకవేళ, మీరు క్రెడిట్ కార్డ్స్ (Credit cards) వినియోగిస్తే.. మీకు ఒక గుడ్ న్యూస్. ఉచితంగానే విమాన ప్రయాణం చేయవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? క్రెడిట్ కార్డ్స్ వినియోగిస్తున్న వారికీ ఈ అవకాశం వచ్చింది. విమానంలో ఉచిత ప్రయాణం ఎలా చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
సంవత్సరానికి 1.5 లక్షలు, రూ. 3 లక్షలు, రూ. 4.5 లక్షలు, రూ. 9 లక్షలు, రూ. 12 లక్షల ఖర్చు మైల్ స్టోన్ ని మించినప్పుడు కాంప్లిమెంటరీ ప్రీమియం ఎకానమీ టిక్కెట్ కూపన్ ను పొందవచ్చు. ఈ కార్డ్ మూడు నెలల ఈజీ డిన్నర్ ప్రైమ్ మెంబర్షిప్ మరియు కాంప్లిమెంటరీ క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్‌షిప్‌తో ఉంటుంది. అయితే, దీని ఫీజు రూ. 4,999 ఉంది.
క్లబ్ విస్తారా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఉచితంగా ఎయిర్‌లైన్ టిక్కెట్లను (Airline ticket) పొందవచ్చు. ఉచిత ప్రీమియం ఎకానమీ టిక్కెట్ (Economy ticket) వోచర్ అందుబాటులో ఉంది. ఫస్ట్-క్లాస్ అప్‌గ్రేడ్ వోచర్ కూడా ఉంటుంది. జాయినింగ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
Kotak Indio Ka Ching 6E రివార్డ్స్ XL క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. దీని ఫీజు రూ. 2,500. మీరు ఉచిత ఇండిగో ఎయిర్‌లైన్ టిక్కెట్‌ను పొందేందుకు కూడా ఈ కార్డ్‌ని ఉపయోగించవచ్చు.ఇది రూ.3 వేల వరకు చెల్లుబాటు అవుతుంది. మీరు గ్రేట్ రివార్డ్ పాయింట్లను కూడా పొందవచ్చు.
స్పైస్‌జెట్ యాక్సిస్ బ్యాంక్ వాయేజ్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. ధర రూ. 2,000. స్పైస్ జెట్ ఈవోచర్ని పొందేందుకు మీరు ఈ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. దీని విలువ రూ. 4,000. కాంప్లిమెంటరీ యాడ్-ఆన్ వోచర్లు కూడా ఉన్నాయి. వీటి ధర రూ. 7,500. మీరు స్పైస్ క్లాజ్ గోల్డ్ సభ్యత్వాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు.
యాక్సిస్ బ్యాంక్ విస్తారా ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. దీని ఫీజు రూ. 10,000 ఉంది. దీని వల్ల కాంప్లిమెంటరీ బిజినెస్ క్లాస్ టికెట్ వోచర్ లభిస్తుంది. సంవత్సరంలో రూ. 2.5 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 7 లక్షలు, మరియు రూ. 12 లక్షలు మైల్స్టోన్ తో ఒక బిజినెస్ క్లాస్ టిక్కెట్ బౌచర్‌ను పొందవచ్చు.
క్లబ్ విస్తారా ఎస్బీఐ కార్డ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీని ఫీజు రూ. 1499. ఈ కార్డ్ విస్తారా ఎకానమీ క్లాస్ ఫ్లైట్ టిక్కెట్‌ను కొనుగోలు చేయవచ్చు. సంవత్సరంలో రూ. 1.25 లక్షలు, రూ. 2.5 లక్షలు, మరియు రూ. 5 లక్షల మైలురాయిని చేరుకున్నట్లయితే, మీరు ఎప్పుడైనా ఎకానమీ క్లాస్ టిక్కెట్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఇంకా, కొన్ని క్రెడిట్ కార్డ్‌లు కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి ప్రయోజనాలను అందిస్తాయి. అదనంగా, అదనపు ఖర్చులకు రివార్డ్ పాయింట్లు ఇస్తారు. అయితే, కార్డును ఎంచుకునే ముందు, మీ అవసరాలను గుర్తుంచుకొని.. సరైన కార్డును ఎంచుకోండి.
Comments are closed.