FlipKart Bumper Offer: ప్రీమియం ఫోన్‌లు విడుదలైన కొన్ని సంవత్సరాల తర్వాత సాధారణంగా ధర తగ్గుతాయి. Apple iPhoneలు, Google మరియు Samsungలు తమ ఫ్లాగ్‌షిప్ పరికరాల ధరలను క్రమంగా తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే Samsung Galaxy S23 ధర ఇటీవల తగ్గించబడింది. 128GB స్టోరేజ్ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.50,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. గత ఏడాది రూ.89,999తో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ (Smart Phone) ఇప్పుడు బ్యాంకు డిస్కౌంట్ (Bank Discount) లతో కలిపి సగం కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది.
Samsung Galaxy S23 ఇప్పుడు Flipkartలో రూ. 46,999కి అందుబాటులో ఉంది. కొన్ని బ్యాంకులు ప్రస్తుతం రూ.3,000 తగ్గింపు ఇస్తున్నాయి. దీంతో ఫోన్ ధర రూ.45,000 కంటే తక్కువకు చేరుకుంది. యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ కార్డ్ లావాదేవీలపై 5% తగ్గింపు అందిస్తుంది. అంటే ఈ డివైజ్ ధర రూ.44,650కి రానుంది. అలాగే Samsung Galaxy S23పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఎక్స్ఛేంజ్ డీల్‌ను కూడా అమలు చేస్తోంది. మీ పాత ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసి రూ.9,000 వరకు తగ్గింపును పొందండి. పాత ఫోన్ బ్రాండ్ మరియు పనితీరు ఆధారంగా ఫోన్ దర నిర్ణయించబడుతుంది. Flipkart EMI ఎంపికలను కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ని రూ.5,222 చెల్లించి నోకాస్ట్ EMI ఆప్షన్‌తో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు.
Galaxy S23 ఫోన్‌లో 6.1-అంగుళాల డైనమిక్ AMOLED FHD+ డిస్‌ప్లే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ లు ఉన్నాయి.
దీని Snapdragon 8 Gen 2 CPU అత్యంత శక్తివంతమైన పనితీరును అందిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో గేమ్‌లు మరియు వీడియో ఎడిటింగ్ పనులను సులభంగా చేసుకోవచ్చు.
ఇది 8GB RAM మరియు 256GB వరకు నిల్వతో అందుబాటులో ఉంది.
3,900 mAh బ్యాటరీతో ఒక రోజు బ్యాకప్‌ను అందిస్తుంది.
25W వైర్డు ఛార్జింగ్‌ని ఉపయోగించి వేగంగా ఛార్జ్ చేయవచ్చు.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ (Android 14 OS) తో పనిచేస్తుంది.
OneUI 6.1 వినియోగదారు ఇంటర్‌ఫేస్ (Interface) సున్నితమైన వినియోగదారు అనుభవాన్ని అందిస్తుంది.
ఇతర ఫీచర్లలో IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, WiFi 6E వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 10MP టెలిఫోటో లెన్స్, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
మంచి యూజర్ ఇంటర్‌ఫేస్, బెస్ట్ ఫోటోగ్రఫీ ఫీచర్లు (Photography Features) , హై రేంజ్ ప్రాసెస్, ఏఐ ఫీచర్ల (AI Features) తో వస్తున్న Samsung Galaxy S23 5G ధర ఇప్పుడు రూ.45,000కి పడిపోయింది. ఇంత తక్కువ ధరకు ఫ్లాగ్‌షిప్‌ను కొనుగోలు చేయడం ఉత్తమమైన డీల్‌గా చెప్పవచ్చు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…