FlipKart Loan: మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? మీకు డబ్బు కావాలా? బంధువులు లేదా స్నేహితుల నుండి డబ్బులు సమయానికి అందడం లేదా? అయితే, దిగులు పడకండి. మీరు సులభంగా రుణం పొందవచ్చు.
ప్రముఖ ఇ-కామర్స్ (E-Commerce) దిగ్గజాలలో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ పర్సనల్ లోన్స్ (Flipkart Personal Loans) ని కూడా అందిస్తోంది. సులభంగా మీరు రూ. 5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాప్‌ని ఉపయోగించి మీ స్వంత ఇంటి నుండి ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సాధారణంగా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు బ్యాంకుల నుంచి లేదా ప్రభుత్వ పథకాల (Government Loans) ద్వారా రుణాలు పొందడం లాంటివి చేస్తుంటారు. వ్యాపారాన్ని ప్రారంభించడానికి, ఇల్లు నిర్మించడానికి లేదా ఇతర ఏదైనా అవసరాలను తీర్చడానికి తగినంత డబ్బు లేనప్పుడు ఆర్థిక సంస్థలు రుణాలు తీసుకుంటాయి. అయితే, ఈ లోన్‌ల కోసం దరఖాస్తు చేసేటప్పుడు, మీరు తప్పనిసరిగా సరైన CIBIL స్కోర్ మరియు ఇతర డాక్యుమెంటేషన్ కలిగి ఉండాలి. లేకపోతే, రుణం మంజూరు చేయరు.
Also Read: Banks RE KYC: బ్యాంకులు రీ-కేవైసీ అడుగుతున్నాయా? సింపుల్ ప్రాసెస్ ఇదే!
మీరు స్నేహితుడి నుండి లేదా కుటుంబ సభ్యుల నుండి రుణం తీసుకున్నప్పటికీ, మీరు రుణాన్ని పొందలేకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో, మీరు ఫ్లిప్ కార్ట్ నుండి సులభంగా లోన్ (Loan) పొందవచ్చు. మొత్తం కలిపి రూ. 5 లక్షలు రుణం పొందవచ్చు. ఋణం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ తన యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఆన్‌లైన్ (Online)లో 5 లక్షలు పొందవచ్చు. ఋణం పొందడానికి, మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను ఓపెన్ చేయండి. యాప్‌ని ఓపెన్ చేసినప్పుడు, పర్సనల్ లోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మీరు మీ లోన్ వడ్డీ రేటు (Loan Interest Rate) ప్రత్యేకతలను చూస్తారు. వడ్డీ రేటు 10.49% నుండి ప్రారంభమవుతుంది. రుణ కాల వ్యవధి 6 నుండి 72 నెలల వరకు ఉండవచ్చు. తర్వాత, మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ అప్లికేషన్‌లో పాన్ కార్డ్, మీ పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ మరియు ఇతర సమాచారాన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత, మీరు లోన్‌కు అర్హులో కాదో మీకు తెలుస్తుంది. మీరు ఒకవేళ అర్హులు అయితే, మీరు ఋణం పొందేందుకు తగిన కాలవ్యవధిని ఎంచుకొని లోన్ పొందవచ్చు. ఇక, ప్రముఖ డిజిటల్ చెల్లింపు సాఫ్ట్‌వేర్ (Software) అయిన ఫోన్ పే ఇప్పుడు అనేక రకాల రుణ ఎంపికలను అందిస్తోంది. మీ అర్హతలను బట్టి, మీరు నిమిషాల్లో ఆన్‌లైన్‌లో లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.