Smartwatch Offers : ప్రస్తుతం కాలం లో టెక్నాలజీ (Technology) రోజు రోజు కి పెరిగిపోవడంతో ప్రజలు కూడా స్మార్ట్ గా ఉండాలి అని అనుకుంటున్నారు. అందుకే టెక్నాలజీ కి అనుకూలం గా ప్రజలు కూడా అప్డేట్ అవుతున్నారు. ఈ నేపథ్యం లోనే స్మార్ట్ వాచ్ లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఒకప్పుడు స్మార్ట్ వాచ్ లు కొనాలి అంటే చాల ఎక్కువ ధరలే ఉండేవి కానీ ప్రస్తుతం స్మార్ట్ వాచ్ (Smartwatch) తయారీదారుల మధ్య పెరిగిన పోటీ కారణంగా ధరలు తగ్గాయి. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం కొన్ని స్మార్ట్ వాచ్ ల పై 70% వరకు తగ్గింపును అందిస్తోంది. ఆ స్మార్ట్ వాచ్ ల ధరలు మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
1. Boat Storm Call :
ప్రస్తుతం ఈ బోట్ స్టార్మ్ కాల్ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్ కార్ట్ 80 శాతం తగ్గింపును అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 7499 గా ఉండగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 1499కే సొంతం చేసుకోవచ్చు. ఇది 1.83-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. 100కి పైగా క్లౌడ్ వాచ్ ఫేస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే నాన్‌స్టాప్‌గా 5 రోజులపాటు పనిచేస్తుంది.
2. Bolt Crown :
బౌల్ట్ క్రౌన్ స్మార్ట్ వాచ్ లో బ్లూటూత్ కాలింగ్ సామర్థ్యాలు ఉన్నాయి. స్క్రీన్ పరిమాణం 1.95 అంగుళాలు గా ఉంటుంది. ఈ వాచ్ 66% తగ్గింపుతో రూ. 1499 కు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎస్‌పీఓ2, బ్లూడ్ మానిటరింగ్, ఆక్సిజన్ శాచురేషన్, హెల్త్ మానిటరింగ్ ఫీచర్‌లను కూడా ఈ స్మార్ట్ వాచ్ లో అందించారు.
3. Fire Bolt Rise :
ఫైర్ బోల్ట్ రైజ్ స్మార్ట్ వాచ్‌పై ఏకంగా 88 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ స్మార్ట్ వాచ్ ను కేవలంరూ. 1399కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.85 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. వాయిస్ అసిస్టెంట్‌ను ఇచ్చారు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను కూడా అందించారు అందించారు.
4. Hammer Ultra Classic :
హామ్మర్ అల్ట్రా క్లాసిక్ స్మార్ట్ వాచ్‌పై 71 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ స్మార్ట్ వాచ్ ను రూ. 1699కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 2.01 ఇంచెస్ కూడిన స్క్రీన్‌ను అందించారు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, టచ్ స్క్రీన్‌ను అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే నాన్‌స్టాప్‌గా 5 రోజులపాటు పనిచేస్తుంది.