Smooth-Chapathi : చపాతీలు దూదిలా మెత్తగా, రుచిగా రావాలంటే ఈ టిప్స్ పాటించండి ..

Telugu Mirror : ప్రస్తుత కాలంలో చాలామందికి బయట తినే అలవాటు ఎక్కువైంది. అయినప్పటికీ ఇంటి భోజనం లో ఉన్న తృప్తి మరి ఎక్కడ లభించదు .ఇంట్లో వండిన రోటి, పప్పు, కూరగాయలతో చేసిన భోజనం సంతృప్తినిస్తుంది. మనం రోటీ తయారు చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రోటీలు చాలా మృదువుగా వస్తాయి. రొట్టెలు చేసేటప్పుడు కొన్ని విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం.రోటి ఆరోగ్యానికి మంచిది రొట్టెలు మెత్తగా రావాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. కొన్నిసార్లు రోటి చేసినప్పుడు గట్టిగా, ఎండిపోయినట్లుగా వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే పిండి కలిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రోటీలు మృదువుగా వస్తాయి.

Migraine Heading : మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా?

పిండి కలిపే పద్ధతి:

రోటీ కోసం పిండిని, పిసికి కలిపేటప్పుడు పిండి ముద్ద మెత్తగా వచ్చేలా కలపాలి. పిండి ముద్ద గట్టిగా ఉండకూడదు. పిండి ముద్ద గట్టిగా ఉంటే రోటీలు సరిగ్గా రావు. పిండిని కలిపిన తర్వాత కొంత సమయం పక్కన పెట్టుకోవాలి. వెంటనే రొట్టె తయారు చేయకూడదు. పిండి కలిపిన గిన్నెపై మూత ఉంచి కొంత సమయం విశ్రాంతి ఇవ్వాలి.అలాగే పిండిని పిసికి కలుపుతున్నప్పుడు అందులో కొద్దిగా వంటకు ఉపయోగించే నూనె వేసి పిండిని కలిపితే రొట్టెలు మృదువుగా వస్తాయి. వేళ్ళతో పిండిని సున్నితంగా తేలికగా ఉపయోగించి పిండిని కలపాలి. చేతి వేళ్లను ఉపయోగించి పిండిని సున్నితంగా, తేలికగా పిండిని కలపాలి.

Make Up Tips : మేకప్ వేసుకునే ముందు మీ చర్మాన్ని ఇలా సిద్ధం చేసుకోండి..

పొడి పిండి వాడకం తగ్గించాలి:

చాలామంది రోటీ చేసేటప్పుడు పొడి పిండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. పొడి పిండిని ఎక్కువగా ఉపయోగించడం వలన అది అంటుకోదు. అప్పుడు రోటీలు సరిగ్గా రావు. కాబట్టి పొడి పిండి వాడటం తగ్గించాలి. పొడి పిండి వాడటం తగ్గించినట్లయితే రోటీలు మృదువుగా వస్తాయి.
ఇలాంటి కొన్ని టిప్స్ అనుసరించి పిండి కలపడం ద్వారా రోటీలు చాలా చక్కగా, మృదువుగా, మెత్తగా, రుచిగా ఉంటాయి.

Leave A Reply

Your email address will not be published.