ప్రతిరోజు ఉదయం టిఫిన్లు, బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీలు , కూరలు, టీ, కాఫీలు ఇవి వండుతూ హడావుడిగా ఉంటారు. ఈ హడావిడి అంతా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కోసం ఉంటుంది. పిల్లలు, భర్త, స్కూల్, ఆఫీస్ కి వెళుతుంటారు కాబట్టి ఈ సమయంలో హడావుడిగా వంట చేస్తుంటారు. దీంతో ఒక్కొక్కసారి కూరలో ఉప్పు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది కూరల్లో ఉప్పు ఎక్కువైతే నిమ్మకాయ పిండుతారు. ఒక్కొక్కసారి నిమ్మకాయ పిండినా ఉపయోగం ఉండదు. దీంతో మళ్లీ వేరొక కూర ను వండుతారు.
కూరలో ఉప్పు ఎక్కువ అయినప్పుడు ఈసారి ఇలా ప్రయత్నించి చూడండి. ఈ సింపుల్ చిట్కాలు పాటించి కూరలో ఎక్కువగా ఉన్న ఉప్పు ను తగ్గించండి. ఈ పదార్థాలను కలపడం వల్ల కూర కు మరింత రుచి పెరుగుతుంది.
కూరలో ఉప్పు ఎక్కువ అయినప్పుడు ఈ చిట్కాలు పాటించండి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
కొబ్బరి పాలు :
కూరలో ఉప్పు ఎక్కువ అయినప్పుడు కూరలో కొబ్బరిపాలు కలపండి. కొబ్బరి పాలను కూరలో కలపడం వల్ల ఉప్పు తగ్గడమే కాకుండా కూరకు మరింత రుచి వస్తుంది. కూరలో కొబ్బరి పాలు వేసి సన్నని మంట పెట్టి ఉడికించాలి. ఇలా చేయడం వల్ల కూరలో ఉప్పు సులువుగా తగ్గుతుంది. మరియు కూరలో కొబ్బరిపాలు కలపడం వల్ల కూరలో గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది.
గోధుమపిండి :
కూరలో ఉప్పు ఎక్కువ అయినప్పుడు దానిని తగ్గించడానికి ఈ చిట్కా కూడా బాగా పనిచేస్తుంది. గోధుమపిండితో కూడా ఉప్పు ను తగ్గించవచ్చు. ఒక గిన్నెలో కొద్దిగా గోధుమపిండిని వేసి నీళ్ళు పోసి ఉండ లా కలపాలి. ఈ గోధుమపిండి ముద్దను కూరలో వేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు అలానే వదిలేయాలి. గోధుమపిండి ముద్ద వేశాక కూర ను వేడి చేయకూడదు. కూరలో ఎక్కువైనా ఉప్పు ను గోధుమపిండి ముద్ద పీల్చేస్తుంది. 10 నిమిషాల తర్వాత గోధుమపిండి ముద్దను కూరలో నుంచి తీసివేయాలి.
Also Read : Restaurant Taste : వంటలలో ఈ పదార్ధాలను వాడండి కూరలో చిక్కదనం,టేస్ట్ లో కమ్మదనం పొందండి
టమాటా లేదా ఉల్లిపాయ :
కూరలో ఉప్పు ఎక్కువ అయినప్పుడు టమాటాలు లేదా ఉల్లిపాయలు కూడా ఉప్పు తగ్గించడానికి సహాయపడతాయి. ఉల్లిపాయ లేదా టమాటాలను ముక్కలు గా కట్ చేయాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ లేదా టమాటా ముక్కలను వేసి వేయించాలి. వేయించిన ఈ ముక్కలను మిక్సీ పట్టి కూరలో వేసి ఉడకనివ్వాలి. ఇలా చేస్తే ఉప్పు తగ్గడమే కాకుండా కూర కు మరింత రుచి పెరుగుతుంది.
బంగాళదుంప :
కూరలో ఉప్పు ఎక్కువ అయినప్పుడు ఈ చిట్కా కూడా చాలా బాగా పనిచేస్తుంది. బంగాళదుంపను ఉడికించి పొట్టు తీసి కూరలో కలపాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు తగ్గడంతో పాటు కూరకు రుచికూడా పెరుగుతుంది.
Also Read : Smooth-Chapathi : చపాతీలు దూదిలా మెత్తగా, రుచిగా రావాలంటే ఈ టిప్స్ పాటించండి ..
కాబట్టి పొరపాటున ఎప్పుడైనా కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇటువంటి కొన్ని చిట్కాలు పాటించి కూరలో ఎక్కువైన ఉప్పును తగ్గించవచ్చు. కూరకు మరింత రుచి ని కూడా అందించవచ్చు.