సోయాబీన్ అనేది బఠాణీ కుటుంబానికి చెందినది. ఇవి విత్తనం రూపంలో ఉండే తినదగినవి. సోయాబీన్ (Soya Been) అత్యంత ప్రజాదరణ పొంది ప్రజలు వంటలో ఉపయోగించే పదార్ధంగా మారింది. సోయాబీన్ తో మీరు రుచికరమైన కూర soya లేదా స్నాక్స్ (Snacks) చేసినా, సోయాబీన్ ఎల్లవేళలా ఉపయోగపడుతుంది. సోయా ఛాప్స్ ను ఏ విధంగా తయారుచేస్తారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అయితే ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో సోయా ఛాప్స్ ఎలా తయారు చేయబడిందో మీరు చూడవచ్చు.
ఒక వ్యక్తి సోయా పిండిని తయారు చేయడానికి పచ్చి సోయాబీన్స్ ను తీసుకుంటుండగా వీడియో క్లిప్ మొదలైంది. పిండిని రెండుసార్లు శుద్ధి చేశారు, తరువాత దాని నుండి పిండిగా మారని కణాలు తొలగించబడతాయి. సోయా బీన్ పిండి, గ్లూటెన్ (Gluten) లేని పిండి (మైదా) మరియు కొంత ఉప్పును ఎలా కలుపుతారో వీడియోలో చూపిస్తుంది.
పిండి తయారైన తరువాత,ఫ్యాక్టరీలోని కార్మికులు సోయా బీన్ ఛాప్స్ తయారు చేయడానికి కర్ర చుట్టూ చుట్టారు.
ఫుడ్ బ్లాగర్ నిఖిల్ చావ్లా ద్వారా ఈ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పోస్ట్ కు క్యాప్షన్ గా అతను “సోయా చాప్ యొక్క రహస్య తయారీ” అని రాశాడు
సోయా గింజలతో ఛాప్స్ ఎలా తయారు చేస్తారో వీడియో చూడండి :
View this post on Instagram
సెప్టెంబర్ 18న ఈ పోస్ట్ షేర్ చేయబడింది. పోస్ట్ చేసినప్పటి నుండి, ఇది ఆరు లక్షల కంటే ఎక్కువ సార్లు వ్యూస్ (Views) ను కలిగి ఉంది. ఈ పోస్ట్ కు 14,000 కంటే ఎక్కువ లైక్‌లు మరియు అనేక కామెంట్‌లను కూడా పొందింది.
ఈ పోస్ట్ గురించి కొంతమంది నెటిజన్లు ఏమి వ్రాశారో ఇక్కడ చూడండి:
ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు, “వేడి నీళ్ళలో ప్లాస్టిక్, ఆహారంలో అన్ని మైక్రోప్లాస్టిక్ (micro Plastic) లను ఊహించుకోండి.”
రెండవ వ్యక్తి, “మీరు మొత్తం తయారీ విధానంను చూపుతున్నారు మళ్ళీ దానిని రహస్యం అని అంటున్నారు.” అని రాశాడు.
“మీరు అవి వెలుపలికి తీయడానికి ఉపయోగించే యంత్రాలు మరియు ప్లాస్టిక్ టబ్‌లలోని పరిశుభ్రత భాగాన్ని మిస్ అయ్యారు. వేడి సోయా చాప్ చాలా ప్రమాదకరమైనది,” అని మూడవ అతను తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
నాల్గవ వ్యక్తి ఇలా వ్యాఖ్యానించాడు, “ఈ సమాచారాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. గ్లూటెన్ ఆరోగ్యానికి మంచిది కాదు.”
ఐదవ వ్యక్తి ఇలా అన్నాడు, “మొదట, చాలా అపరిశుభ్రమైన ప్లాంట్/ప్రాసెస్ యూనిట్. రెండవది, అది హెయిర్‌నెట్ (Hair Net) , షవర్ క్యాప్ కాదు. బ్లాగింగ్ అని పిలవబడే పేరుతో అపరిశుభ్రమైన విషయాలను ప్రచారం చేయవద్దు. @fssai_safefood వారు QA వారి యొక్క మనిషిని నియమించుకున్నారని ఆశిస్తున్నాను అని వ్యక్తం చేశాడు.