Free Eye Check Up In Janagon 2024: జనగామలో ఉచిత వైద్య శిభిరం, మార్చి 6న ప్రారంభం

నేటి డిజిటల్ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను ఉపయోగించకుండా రోజు గడపడం కష్టమవుతుంది. కంప్యూటర్లు, మొబైల్ పరికరాలను గంటల తరబడి చూడడం వల్ల చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు.

నేటి ప్రపంచంలో శరీరానికి సరిపడా పోషకాహారం అందక ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న పిల్లలు కూడా, వయస్సుతో సంబంధం లేకుండా, దృష్టి సమస్యలను ఎదుర్కొంటారు. కంటి లోపాలు మరియు దృష్టి లోపం గతంలో వృద్ధులకు మాత్రమే ఉండేవి. అయితే, నేటి డిజిటల్ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను ఉపయోగించకుండా రోజు గడపడం కష్టమవుతుంది. కంప్యూటర్లు, మొబైల్ పరికరాలను గంటల తరబడి చూడడం వల్ల చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు.

ఒత్తిడి, ఆహార లోపం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం మరియు ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు వినియోగించడం అన్నీ ఈ రోజుల్లో కంటి సమస్యలకు కారణం అవుతున్నాయి. డిజిటల్ పరికరాలపై ఎక్కువ సమయం గడిపే వారికి ఈ దృష్టి లోపం వచ్చే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా పిల్లలలో ఒత్తిడిని సృష్టిస్తుంది. అందుకే పిల్లలు మొబైల్ టీవీకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

చిన్న,పెద్ద అనే తేడా లేకుండా కంటి సమస్యలు ఈరోజుల్లో ఎక్కువవుతున్నాయి. అందుకే పౌష్టికరం తీసుకోవాలి అని వైద్యులు చెబుతున్నారు.

అయితే కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు జనగామలో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ వైద్య శిబిరం మార్చి 6న జనగామ పట్టణ కేంద్రంలోని ఆరోగ్య మాత ఉడుముల ఆసుపత్రిలో నిర్వహించనున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పాల్గొనేవారు ఉచిత వైద్య పరీక్షలు అందుకుంటారు.

అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం (Rajiv Aarogyasri Scheme 2024) ద్వారా పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. మార్చి 6వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరం జరుగుతుందని నిర్ధారించారు.

ఈ శిబిరంలో పాల్గొనేవారు తమ ఆధార్ లేదా రేషన్ కార్డులను తీసుకురావాలన్నారు. ఈ ఉచిత కంటి శిబిరాన్ని జనగామ జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.

Free Eye Check Up In Janagon 2024

 

 

 

 

 

 

 

Comments are closed.