Telugu Mirror : మనిషి యొక్క సెక్స్ లైఫ్(Sex Life) వారి జీవన శైలి మీద ఆధారపడి ఉంటుంది. ఒకప్పటి తో పోల్చుకుంటే ఇప్పటి వారి ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కువ సమయం ఉద్యోగ,వ్యాపార,కుటుంబ పోషణ పనులకే సరిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి సెక్స్ జీవితం పట్ల ఆసక్తిని కోల్పోతున్నారు.కనీసం భాగస్వామితో గడిపే సమయం కూడా తక్కువగా ఉంటుంది.మీలో ఉన్న ఒత్తిడిని దూరం చేసి మీ యొక్క సెక్స్ డ్రైవ్ ని పెంచేలా ప్రయత్నం చేయండి.
ప్రతి వ్యక్తి వారి స్వంత సెక్స్ డ్రైవ్(Sex Drive) ని కలిగి ఉంటారు.సెక్స్ డ్రైవ్ లేదా లిబిడో అనేది వారి యొక్క మానసిక ప్రేరణ. లిబిడో అనగా కామేచ్ఛ.ఒక వ్యక్తి లో తరచుగా లైంగిక చర్యలో పాల్గొనాలి అనే కోరికతో ముడిపడి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం లిబిడో లో పెరుగుదల లేదా తగ్గుదల కు దారితీసే పరిస్థితులు ఉంటాయి.లిబిడో(Libido) ను పెంచుకోవడం, రక్త సరఫరాను మెరుగు పర్చడం అలానే గుండె ఆరోగ్యాన్ని, పోషకాహారం ద్వారా శక్తిని పెంచుకోవడం ద్వారా ఆరోగ్య కరమైన లైంగిక జీవితానికి మార్గమని అధ్యయనాలు చెబుతున్నాయి.
RainFall : తెలంగాణలో భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణకు రెడ్ ఎలర్ట్ జారీ..
లిబిడో-బూస్టింగ్(Libido-boosting) లనే కామోద్దీ పనలు అంటారు.కామోద్దీపన అంటే లైంగిక కోరికను కలిగించేది.లైంగిక ఆకర్షణ పెంచేది, లైంగికానందం లేదా మనిషి లైంగిక ప్రవర్తనను పెంచేది. దానినే లిబిడో అంటారు ఈ లిబిడోను పెంచుకోవడం ద్వారా ఆనంద కరమైన,ఆరోగ్య కరమైన లైంగిక జీవితాన్ని ఆస్వాదించేందుకు సహాయ పడే 6 పండ్లు గురించి తెలుసుకుందాం.
మీ దాంపత్య జీవితానికి మసాలా జోడించే 6 పండ్లు ఇక్కడ ఉన్నాయి:
యాపిల్స్ :
పలు అధ్యయనాలు వెల్లడించిన ప్రకారం మీ పడక గదిలో యాపిల్స్ కూడా మీకు సహాయ పడతాయని నిపుణులుచెబుతున్నారు.యాపిల్ లో క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్స్ విపరీతంగా ఉంటాయంట.ఇది రక్తప్రసరణను పెంచడం,అంగస్థంభన మరియు ప్రోస్టేటిస్ లక్షణాలకు చికిత్సలో ఉపయోగపడుతుంది.ఒక అధ్యయనం ప్రకారం యాపిల్ తినే వారిలో 14 శాతం అంగస్థంభన(Paralysis) తగ్గుముఖం పట్టిందని తెలిపారు.ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యం తో పాటు మీ సెక్స్ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.
పుచ్చకాయ :
పుచ్చకాయలు లో ఎల్-సిటృల్లైన్(L-citrulline) దీనినే ఆమైనో యాసిడ్ అంటారు.ఇది పుష్కలంగా ఉంటుంది వాటర్ మెలొన్ లో.ఇది రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎల్-సిటృల్లైన్ మీ శరీరంలో ఎల్-అర్జినైన్ గా మారుతుందని ఈ రెండిటి కలయిక నైట్రిక్ ఆక్సైడ్(Nitric Oxide) ని ఉత్పత్తి చేసి పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచి తద్వారా అంగ స్థంభనలను బలపరుస్తుంది.
అరటిపండు :
అరటి పండు లో పొటాషియం కావలసినంత ఉంటుంది.ఇది శరీరానికి ముఖ్యమైనది.అమెరికన్ హార్ట్ అసోషియేషన్ వారి నివేదిక ప్రకారం, పొటాషియం మీ రక్త పోటు(blood flow)ను తగ్గించడంలో అనుకూలంగా ఉంటుంది.ఇది లైంగిక పనితీరును మెరుగు పరుస్తుంది. జననేంద్రియాలతో సహా శరీరంలోని కొన్ని భాగాలకు రక్త ప్రసరణను సరిగా జరిగేలా చూస్తుంది.
ToDay Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈరోజు బుధవారం, జూలై 19, 2023 తిథి ,పంచాంగం
దానిమ్మ :
దానిమ్మ గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్ గా ఉంటాయి.ఇవి రక్తప్రవాహం చురుకుగా జరిగేలా పనిచేస్తాయి.ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇంపోటెన్స్ రీసెర్చ్ లో వెలువడిన అధ్యయనం వివరాలలో దానిమ్మ గింజల రసం ద్వారా జరిగే మేలు అద్భుతం అని చెప్పవచ్చు.ఇది కూడా మీ లైంగిక జీవితంపై ఖచ్చిత ప్రభావం చూపుతుంది.
అవకాడో :
అవకాడో లలో విటమిన్-బి మరియు మోనో అన్ శాచురేటెడ్ కొవ్వు అధిక మోతాదులో ఉన్నాయి. ఇవి పురుషాంగంతో పాటు శరీరం మొత్తానికి రక్త ప్రవాహానికి తోడ్పడుతుందని పరిశోధనలలో వెల్లడి అయినది.అవకాడో లో పొటాషియం కూడా ఉంది. అవకాడో పురుషులలోనే కాకుండా మహిళలలో కూడా లిబిడోను పెంచేలా చేస్తుంది.
స్ట్రా బెర్రీలు :
స్ట్రాబెర్రీలు కూడా లిబిడోను పెంచేందుకు అనుకూలిస్తాయి.నిపుణుల అభిప్రాయాలను బట్టి ఈ పండ్ల విత్తనాలు జింక్(Zinc) ని కలిగి ఉంటాయి.ఇవి పురుషులకు అలానే మహిళలకు ఇద్దరికీ సెక్స్ కి అవసరం.