Ganga River National River: ప్రపంచంలో నీరు కీలక పాత్ర పోషిస్తుందని మన అందరికీ తెలుస్తుంది. మన భూమి ఎన్నో నదులు, సముద్రాలతో నిండి ఉంటుంది. భారత దేశంలో ఎన్నో నదులు ప్రవహిస్తాయి. సకల వనరులకు భారత దేశం పుట్టినిల్లుగా ఉంటుంది అని మన పెద్దలు అంటూ ఉంటారు. గంగ నది గురించి మన అందరికీ తెలుసు. గంగ నది నీరు ఒక్కసారైనా శరీరాన్ని తాకితే సకల పాపాలు పోతాయని ప్రజలు నమ్ముతారు.
గంగ నది మన జాతీయ నది అని మన అందరికీ తెలుసు. మరి, ఇంతకీ మన జాతీయ నది అయిన గంగ నదిని జాతీయ నదిగా ఎప్పుడుప్రకటించారు? ఎందుకు ప్రకటించారు? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భాగీరథి నది ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి హిమానీనదం సమీపంలో ప్రారంభమవుతుంది. అలకనందనది దేవప్రయాగ దగ్గర కలుస్తుంది. అక్కడ నుండి, ఇది “గంగా” అనే పేరుతో అవతరిస్తుంది. ఈ నది హిమాలయాల గుండా కొంత దూరం ప్రయాణించి హరిద్వారం సమీపంలోని లోతట్టు ప్రాంతాలలోకి ప్రవేశిస్తుంది.
కాంగ్రెస్ మరియు దాని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 2004 మరియు 2009 సాధారణ ఎన్నికలలో విజయం సాధించాయి. మన్మోహన్ సింగ్ 2004 నుండి 2014 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో భారత దేశం అది పెద్ద నది అయిన ఈ గంగా నదిని నవంబర్ 4, 2008న, భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గంగానదిని భారతదేశ జాతీయ నదిగా ప్రకటించారు. అప్పటి నుండి, ఇది భారతదేశ జాతీయ చిహ్నాలలో ఒకటిగా మారింది.
Also Read:Tirumala Darshan Every Week For That People: తిరుమల దర్శనం ఇక పై వారికి ప్రతి వారం, ఎవరికంటే?
గంగ నదిని ఎందుకు జాతీయ నదిగా ప్రకటించారు?
గంగా నది కార్యాచరణ ప్రణాళిక (GAP) లక్ష్యాలను చేరుకోవడానికి, భారత ప్రధాని 2008లో గంగానదికి జాతీయ నదిగా ప్రకటించారు. పరిశుభ్రత మరియు ఆధ్యాత్మికతకు ప్రాతినిధ్యం వహిస్తున్న గంగానది భారతదేశ పవిత్ర నదిగా గుర్తింపు పొందింది. అందుకే ఇది జీతీయ నదిగా అవతరించింది.