Garlic Oil : కొన్ని రకాల నూనెలు, అనేక రకాల వ్యాధుల చికిత్సకు సమర్థవంతమైన మంచి ఔషధం (medicine) లా పని చేస్తాయి. కొన్ని రకాల నూనెలు, రసాయనాలతో నిండి ఉంటాయి. కనుక వాటితో చాలా రకాల (Side effects) కలుగుతాయి.
కానీ కొన్ని రకాల నూనెలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. అంతేకాకుండా సుగంధాన్ని కూడా కలిగి ఉంటాయి. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అటువంటి ఆయిల్స్ లలో ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ వంటివి వివిధ రకాలుగా ఔషధంగా ప్రసిద్ధి చెందిన నూనెలు.
ఇవే కాకుండా చాలా మందికి తెలియని మరొక నూనె ఉంది. ఇది కూడా శరీరానికి చాలా ఉపయోగాలను అందిస్తుంది. అదే వెల్లుల్లి నూనె. ఈ నూనెను వెల్లుల్లి తో తయారు చేస్తారు. వెల్లుల్లిలో ఎటువంటి ఔషధ గుణాలు ఉన్నాయో, అవే ఔషధాలు వెల్లుల్లి నూనెలో కూడా ఉన్నాయి.
Let’s find out what are the health benefits of using garlic oil.
వెల్లుల్లి నూనె అనారోగ్య సమస్యలకు మాత్రమే కాకుండా చర్మం మరియు జుట్టు (hair) సమస్యలకు కూడా చాలా బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నూనె,సోరియాసిస్, మొటిమలు, మచ్చలు, ముడతలు, నల్లటి వలయాలు వంటి చర్మ (skin) సమస్యలకు మంచి ఔషధంలా పని చేస్తుంది.
Also Read : Ginger Garlic Soup : చలికాలంలో మజానిచ్చే అల్లం వెల్లుల్లి సూప్, హాయినిస్తుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది .
ఈ నూనెలో సల్ఫర్ సమ్మేళనాలు ఉండటం వలన కొత్త కణజాలాల ఏర్పాటును పెంచుతాయి.
దెబ్బలు తగిలినప్పుడు గాయాలకు రక్తాన్ని సరఫరా చేయడంలో దోహదపడతాయి.
వెల్లుల్లి నూనెలో సల్ఫర్ ఉంటుంది. ఇది గుండె (heart) సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించేలా చేస్తుంది.
ధమనులలో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. స్ట్రోక్ వంటి పరిస్థితులను నివారిస్తుంది. Garlic oil రక్తనాళాల స్థితి స్థాపకత ను పెంచుతుంది. దీనివలన రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
చిత్త వైకల్యం లేదా జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి న్యూరో వ్యాధులను నివారించడంలో వెల్లుల్లి నూనె ఉపయోగపడుతుంది.
ఈ వెల్లుల్లి నూనెలో డయల్ డై సల్ఫైడ్ మరియు ట్రై సల్ఫైడ్ వండి సల్ఫర్ సమ్మేళనాలు ఉండటం వలన ఆక్సీకరణం, కొలెస్ట్రాల్ నిల్వలను నిరోధించడంలో సహాయపడుతాయి.
ఇది ఆక్సీకరణం చెందినప్పుడు మెదడు (brain) లో రక్తం గడ్డ కట్టడానికి దారితీస్తుంది. వెల్లుల్లి నూనె సహజ కిల్లర్ కణాల కార్యకలాపాలను పెంచుతుంది.
వెల్లుల్లి నూనెను యాంటీ వైరల్ గా కూడా ఉపయోగించవచ్చు.
Garlic oil ఇమ్యునో మోడ్యులేటరీ ప్రభావాలను కలిగి ఉంటుంది. కనుక ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే శరీరంలో వచ్చే వాపు మరియు మంటను తగ్గిస్తుంది.
జలుబు, దగ్గు మరియు చెవి నొప్పి, పంటి నొప్పితో బాధపడే వారు కూడా వెల్లుల్లి నూనెను వాడటం వల్ల ఉపశమనం కలుగుతుంది.
Also Read :Garlic Uses : రోజువారీ ఆహారంలో వెల్లుల్లి ప్రయోజనాలు.. తెలిస్తే వదిలి పెట్టరు..
వెల్లుల్లి నూనెను ప్రతిరోజు తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలను నాశనం చేసే లక్షణాలు ఉన్నాయి.
వెల్లుల్లి నూనెలో దూదిని ముంచి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రదేశంలో రాత్రంతా ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.
వెల్లుల్లి నూనెను యాంటీ వైరల్ గా కూడా ఉపయోగించవచ్చు. శరీరంలోకి ఏదైనా వైరస్ ప్రవేశించినప్పుడు సహజ కిల్లర్ గా పనిచేయడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి నూనెలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి అందరూ Garlic oil ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి.
గమనిక :
ఈ కథనం వివిధ మాధ్యమాల ద్వారా సమీకరించి వ్రాయబడింది.పాఠకులకు జ్ఞానం మరియు అవగాహన కల్పించడం కోసం మాత్రమే.దీనిని వాడే ముందు నిపుణులను సంప్రదించగలరు.