Gas Cylinder Rates: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు, రేట్లు ఎలా ఉన్నాయంటే?
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే వాణిజ్య పెట్రోల్ సిలిండర్ రేట్లు తగ్గడం హాట్ టాపిక్‌గా మారింది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు 19 రూపాయలు తగ్గించాయి.
Gas Cylinder Rates: గ్యాస్ సిలిండర్ల ధరలు గృహ ఖర్చులు మరియు వ్యాపార పెట్టుబడులపై ప్రభావం చూపుతాయి. దేశీయ LPG సిలిండర్ల ధర మధ్యతరగతి ప్రజలు సేవింగ్స్ మరియు ఖర్చులపై ప్రభావం చూపుతుంది. వాణిజ్య LPG ఖర్చులలో ఇదే విధమైన వ్యాపార కంపెనీ పెట్టుబడిని పెంచుతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), మరియు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ప్రతి నెలా ఒకటో తేదీన వంట గ్యాస్ ధరలను అప్డేట్ చేస్తాయి.
గతంలో విపరీతంగా పెరుగుతూ వచ్చిన ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గత ఏడాది రాఖీ పండుగ (Rakhi Festival) సందర్భంగా, మార్చ్ నెలలో మహిళల దినోత్సవం సందర్భంగా గ్యాస్ ధరలు బాగా తగ్గాయి. పెట్రోల్ (Petrol) , డీజిల్ (Diesel) ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే, మే నెలలో కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. వరుసగా రెండో నెలలో గ్యాస్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
లోక్‌సభ (Loksabha) ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే వాణిజ్య పెట్రోల్ సిలిండర్ రేట్లు తగ్గడం హాట్ టాపిక్‌గా మారింది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు 19 రూపాయలు తగ్గించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చినట్టు తెలుస్తుంది.
రేట్లు సవరించిన తర్వాత, దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) ధరలు ఇప్పుడు రూ. 19 తగ్గింపుతో రూ. 1764.50 నుండి రూ. 1745.50కి తగ్గింది. ముంబై లో రూ.1717.50 నుండి రూ. 1698.50కి దిగొచ్చింది. చెన్నైలో ఈ పెట్రోల్ సిలిండర్ ధర రూ. 1930 నుంచి.. 1911కి పడిపోయింది. కోల్‌కతాలో రూ. 20 తగ్గి 1879 నుంచి రూ. 1859 కు పడిపోయింది. హైదరాబాద్‌లో చూస్తే గత నెలలో రూ. 32.50 తగ్గి రూ. 1994.50 వద్ద ఉంది.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించినప్పటికీ, గృహ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు లేదు. వాణిజ్య గ్యాస్ సిలిండర్లను ఎక్కువగా రెస్టారెంట్లు, మోటెళ్లు మరియు వీధి వ్యాపారులు ఉపయోగిస్తున్నారు. దీంతో బయట ఫుడ్ తినే వ్యక్తులకు ఉపశమనం కలిగిస్తుందని ..రేట్లు తగ్గే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఢిల్లీ (Delhi) లో ప్రస్తుత దేశీయ పెట్రోల్ సిలిండర్ ధర 803 ఉండగా.. ఉజ్వల ప్లాన్ కింద రూ. 300 సబ్సిడీ లభిస్తుంది, అయితే దాంతో ఇది రూ. 503 కి లభిస్తుంది. హైదరాబాద్‌లో దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలు రూ. 855 గా ఉంది.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న కేంద్రం ఈ పెట్రోల్ సిలిండర్ల ధరలను రూ. 100 తగ్గించిన విషయం తెలిసిందే. కిందటేడాది ఆగస్టు 29న రాఖీ సందర్భంగా రూ. 200 తగ్గింది. ఇదే క్రమంలో ఉజ్వల పథకం ద్వారా గతంలో రూ. 200 సబ్సీడీ ఇవ్వగా.. ఇప్పుడు 300కి పెంచారు.
ప్రపంచవ్యాప్త చమురు ధరలలో మార్పులు, పన్నుల నిబంధనలు మరియు సరఫరా-డిమాండ్ డైనమిక్స్ అన్నీ ఈ మార్పులకు కారణమని చెప్పవచ్చు. వరుస ధరల మార్పులు ఇంధన మార్కెట్ యొక్క అస్థిరత స్వభావాన్ని సూచిస్తాయి. వాణిజ్య LPG సిలిండర్లపై ఆధారపడే గృహాలు మరియు వ్యాపారాలపై ప్రభావాలను చూపిస్తున్నాయి.
Comments are closed.