Gas Cylinder Subsidy Check: ఒకప్పుడు వంట గ్యాస్ అంటే ఎవరికీ తెలీదు. అందరు కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకునేవారు. గ్యాస్ సిలిండర్లు వచ్చాక ఇక మహిళల పని మరింత సులభంగా మారింది. అయితే, గ్యాస్ సిలిండర్ల (Gas Cylinders) ధరలు గృహ ఖర్చులు మరియు వ్యాపార పెట్టుబడులపై ప్రభావం చూపుతాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ప్రారంభించింది.
తెలంగాణ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్‌ను అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సబ్సీడీ (Subsidy) లు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.500లకే గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) లబ్ధిదారులకు అందజేస్తోంది. అయితే, చాలా మందికి సబ్సిడీలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని ఎలా తెలుసుకుంటారో తెలియడం లేదు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఆరు హామీల్లో ఒకటిగా దీన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, సిలిండర్ ధర డెలివరీ సమయంలో సేకరిస్తారు, మిగిలిన మొత్తాన్ని సిలిండర్ సబ్సిడీ ధర తర్వాత అర్హత కలిగిన వారికి పంపిణీ చేస్తారు. ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతా (Bank Account) లో జమ చేస్తారు. అయితే, తమకు సబ్సిడీ వచ్చిందో లేదో ఎలా నిర్ణయించాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే, సబ్సిడీ డబ్బులు అందాయో లేదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
సబ్సిడీ డబ్బులు అందాయో లేదో తెలుసుకోవడానికి ముందుగా www.mylpg.in అధికారిక వెబ్‌సైట్ (Official Website) ని సందర్శించి లాగిన్ ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు ఖాతా పేజీని ఓపెన్ చేసినప్పుడు, లబ్ధిదారుని ఫోటో పేజీ పైన కనిపిస్తుంది. ఆ తర్వాత, లబ్ధిదారులు తమ సిలిండర్ ఏ కంపెనీకి చెందినదో గుర్తించి, క్లిక్ చేసి ఎంచుకోవాలి. ఆ తర్వాత, మీ సిలిండర్ సబ్సిడీ హిస్టరీని పరిశీలించడానికి వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీని ఎంచుకోవాలి. ఇక అక్కడ మొత్తం సబ్సీడీ హిస్టరీ (Subsidy History) ని చూడవచ్చు. లేదంటే, ఫిర్యాదు చేయడానికి 1800233355కు ఫోన్ చేయండి.