కెరాటిన్ ట్రీట్మెంట్ తో మెరిసే జుట్టు మీ సొంతం, డబ్బు మితం పోషణ అమితం.
చాలా మంది జుట్టు రాలే సమస్యను కలిగి ఉంటారు అలాగే జట్టులో మెరుపు తగ్గి నిర్జీవంగా మారి సహజత్వాన్ని కోల్పోతుంది అటువంటి వారు పార్లర్ కు వెళ్ళి కెరాటిన్ ట్రీట్మెంట్ తీసుకుంటారు.మధ్యతరగతి మహిళలకు ఇది ఖర్చు తో కూడుకున్నది. ఖర్చు లేకుండా ఇంటివద్దే కెరటిన్ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.
Telugu Mirror : ప్రతి ఒక్కరూ నల్లని మరియు దృఢమైన అలాగే మెరిసే జుట్టు కావాలని కోరుకుంటారు. కానీ వాతావరణం లో కాలుష్యం వల్ల జుట్టు చాలా నిర్జీవంగా మారడంతో పాటు డామేజ్ కూడా అవుతుంది. అటువంటి పరిస్థితులలో కేశాలను సహజ పద్ధతిలో అందంగా మార్చడం కోసం మహిళలు, అమ్మాయిలు అనేక రకాల హెయిర్ ట్రీట్మెంట్లు తీసుకుంటారు. ఈ ట్రీట్మెంట్లలో కెరాటిన్ ట్రీట్మెంట్ (Keratin treatment) కూడా ఉంటుంది. ఈ చికిత్స ద్వారా జుట్టుకు సహజ సౌందర్యం వస్తుంది. అయితే దీనికోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ కెరాటిన్ ట్రీట్మెంట్ 4000 వేల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. అటువంటి సందర్భంలో కెరాటిన్ చికిత్స చేయించాలంటే అందరి దగ్గర అంత డబ్బు మరియు సమయం కూడా ఉండకపోవచ్చు.
అటువంటి వారి కోసం ఇవాళ ఇంట్లోనే కెరాటిన్ ట్రీట్మెంట్ ఎలా చేయాలో తెలియజేస్తున్నాము.దీని ద్వారా పార్లర్ లో లభించే ఫలితం ఇంట్లోనే పొందవచ్చు. దీనికోసం పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. దీనివల్ల సమయం మరియు డబ్బు రెండు కూడా ఆదా చేసుకోవచ్చు.శరీరంలో ప్రోటీన్ మోతాదు తగ్గి వెంట్రుకలు రాలడం మొదలైనప్పుడు మరియు వెంట్రుకలు నిర్జీవంగా అవుతున్నప్పుడు ఈ కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు.ఈ చికిత్సలో జుట్టు మొత్తానికి క్రీం అప్లై చేస్తారు. తర్వాత సాధారణ నీటితో కడుగుతారు.ఇంట్లో ఈ చికిత్స ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
Also Read : నడకతో ఆరోగ్యం మీ సొంతం, ఎక్కువగా నడవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో!
కెరాటిన్ మాస్క్ కి కావలసిన పదార్థాలు:
కలబంద , ఉడికించిన రైస్, పెరుగు, విటమిన్- ఇ ఆయిల్, ఆలివ్ ఆయిల్.
తయారీ విధానం:
కెరాటిన్ మాస్క్ తయారు చేయడం కోసం ఒక గిన్నెలో ఫ్రెష్ అలోవెరా జెల్ (Aloe vera gel) వెయ్యాలి. తర్వాత నాలుగోవంతు ఉడికిన రైస్ మరియు నాలుగు నుంచి ఐదు స్పూన్ల పెరుగు, ఒక విటమిన్ ఇ క్యాప్సిల్ ఆయిల్ అలాగే ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ (Olive oil) వేసి పేస్టులా తయారు చేయాలి. హెయిర్ మాస్క్ రెడీ అయింది.ఈ హెయిర్ ప్యాక్ ను తలకు అప్లై చేసే ముందు తల స్నానం చేయాలి. అలాగే జుట్టు పూర్తిగా పొడిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ప్యాక్ ని తలకి అప్లై చేయాలి. జుట్టును అనేక భాగాలుగా విభజించి రూట్స్ నుండి జుట్టు చివరి వరకు అంతటా అప్లై చేయాలి. తర్వాత అల్యూమినియం ఫాయిల్ తో జుట్టును మొత్తం కవర్ చేయాలి.
Also Read : యుక్త వయసులో గుండెపోటు రావడానికి కారణాలు ఇవే,అవేంటో తెలుసుకొండి.
40 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూ తో కడగాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేయడం వల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గిపోతుంది. మరియు జుట్టులో మెరుపు కనిపిస్తుంది. జుట్టు చాలా అందంగా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ కెరాటిన్ మాస్కుని ఇంట్లోనే తయారు చేసుకొని వాడటం వలన పార్లర్ (Parlor)లో వచ్చే మెరుపును ఇంట్లోనే పొందవచ్చు. తద్వారా మీ జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు మరియు అందమైన మరియు మెరిసే జుట్టును సొంతం చేసుకోవచ్చు. అలాగే వేల రూపాయలను మరియు సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు.