Godzilla Minus One Movie: ఈ సంవత్సరం ఆస్కార్స్‌లో మెరిసిన అనేక చిత్రాలలో అద్భుతమైన జపనీస్ చిత్రం గాడ్జిల్లా మైనస్ 1 ఒకటి. ఈ జపనీస్ చిత్రం దాని స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం అకాడమీ అవార్డును అందుకుంది. తకాషి యమజాకి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత సంవత్సరం డిసెంబర్ 1 న జపాన్‌లో విడుదలైంది. ఇక అక్కడ హిట్ కొట్టి ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తూ బ్లాక్‌బస్టర్‌గా ఈ చిత్రం నిలిచింది.
హాలీవుడ్‌లో గాడ్జిల్లా అండ్ కాంగ్ న్యూ ఎంపైర్ అనే సినిమా వచ్చినప్పటికీ, గాడ్జిల్లా జపాన్ వెర్షన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా OTT విడుదలపై ఎలాంటి అప్‌డేట్ లేనందున ఇది సస్పెన్స్‌ను పెంచుతుంది. అయితే ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.
హాలీవుడ్ చిత్రాలలో కనిపించే అనేక చిత్రాల్లో మాన్స్టర్ చిత్రాలు ఒకటి. అయితే, హాలీవుడ్‌లో, ఇంగ్లీష్ వాళ్ళ నుండి హిట్ సాధించిన ఫ్రాంచైజీలలో “గాడ్జిల్లా” సిరీస్ ఒకటి. గాడ్జిల్లాతో వచ్చే జపనీస్ వెర్షన్ (Japan Version) ఎప్పటి నుండో ఉంది. అది పక్కన పెడితే. దీనికి మంచి క్రేజ్ ఉండగా గతేడాది విడుదలైన “గాడ్జిల్లా మైనస్ 1” సినిమా అయితే మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది.
Also Read: Jio Free OTT Content: జియో నుంచి సూపర్ ఆఫర్, ఫ్రీగా ఓటీటీ కంటెంట్
ఈ సంవత్సరం అత్యుత్తమ గ్రాఫిక్స్ విభాగంలో ఆస్కార్ (Oscar) ను కూడా అందుకుంది. ఇంకా, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులలో ఈ చిత్రం ఒక హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. అయితే, ఈ చిత్రం OTT విడుదలకు కూడా ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల, ప్రైమ్ వీడియో సుమారు 6 నెలల తర్వాత, అది కూడా జపాన్ (Japan) లోనే విడుదల చేశారు. తర్వాత, ఇండియా (India) లో ఎక్కువగా స్ట్రీమింగ్ అయ్యే సైట్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లోకి వీక్షించేందుకు ఇది అందుబాటులో ఉంది.
ఈ చిత్రం ఇప్పుడు మన దేశంలోని ఒరిజినల్ జపనీస్ (Japanese) డబ్బింగ్ వెర్షన్‌తో పాటు, హిందీ, తమిళంలో అందుబాటులో ఉంది. అయితే మన తెలుగు వెర్షన్ ఇవ్వకపోవడం కాస్త బాధకరంగా ఉంది. ఇక , మన దగ్గర దీన్ని చూడాలనుకుంటే, ఇది ఈ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది. తకాషి యమజాకి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ర్యూనోసుకే కమికి, మినామి హమాడే, యుకీ యమడ మరియు ఇతరులు నటించారు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…